జగన్ దెబ్బకు జేసీకి ఏడేళ్ల తర్వాత అది గుర్తొచ్చిందట

తన దాకా వస్తే కాని నొప్పి తెలీదట. జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారం అలాగే ఉంది. 2014 నుంచి ఐదేళ్ల పాటు ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు రాయల [more]

Update: 2021-03-28 14:30 GMT

తన దాకా వస్తే కాని నొప్పి తెలీదట. జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారం అలాగే ఉంది. 2014 నుంచి ఐదేళ్ల పాటు ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు రాయల తెలంగాణ జేసీ దివాకర్ రెడ్డికి గుర్తుకు రాలేదు. అప్పుడు అంతా ఆంధ్రప్రదేశ్ భేష్ అని పొగిడే పనిలోనే జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. తెలుగుదేశం లో చేరిన దివాకర్ రెడ్డికి ఆ అయిదేళ్లు తెలంగాణ కూడా గుర్తుకు రాలేదు. కానీ గత ఇరవై నెలలుగా మాత్రం ఆయన రాయలతెలంగాణను కలవరిస్తున్నారు.

ఇరవై నెలలుగా….

గత ఇరవై నెలల నుంచి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం అన్ని రకాలుగా ఇబ్బంది పడుతోంది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. దివాకర్ ట్రావెల్స్ దాదాపు మూతబడినట్లే. గనుల వ్యవహారంలో కూడా ఎండ్ కార్డు పడింది. భారీ జరిమానాలు విధిస్తూ, నోటీసులు ఇస్తూ జేసీ దివాకర్ రెడ్డిని అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. గుక్క తిప్పుకోకుండా చేస్తున్నారు. జేసీ దివాకర్ రెడ్డి గత మూడు దశాబ్దాల కాలంలో ఎప్పుడూ ఇలాంటి అనుభవాలను చూడలేదు.

తాము అధికారంలో ఉన్నప్పుడు….

అంతా ఆ కుటుంబం చేసుకున్న స్వయంకృతమే. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ను టార్గెట్ చేసుకుని తిట్టిపోశారు. జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో సహజంగానే అధికారంలోకి రాగానే వైసీపీకి జేసీ దివాకర్ రెడ్డి టార్గెట్ అయ్యారు. అన్ని రకాలుగా దిగ్భంధనం చేశారు. కేసులు బనాయించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి దాదాపు రెండు నెలలు జైలులో ఉండి వచ్చారు. ఇలా అన్ని రకాలుగా నష్టపోయిన జేసీ దివాకర్ రెడ్డికి ఇప్పుడు ఉన్నట్లుండి రాయలతెలంగాణ గుర్తొచ్చింది.

ఇన్నాళ్లకు రాయల తెలంగాణ…..

తాము తెలంగాణలో ఉండి ఉంటే బతికిపోయేవాళ్లమన్న భావనలో జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. అందుకే ఆయన అసహనంతో మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిపై కూడా కామెంట్స్ చేశారు. తాము రాయల తెలంగాణ విషయంలో జైపాల్ రెడ్డితో టచ్ లో ఉన్నామని, ఆయనను నమ్మి మోసపోయామని జేసీ దివాకర్ అనడం గమనార్హం. మొత్తం మీద జగన్ దెబ్బకు జేసీ దివాకర్ రెడ్డికి ఏడేళ్ల తర్వాత రాయల తెలంగాణ గుర్తుకొచ్చిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News