జేసీ ఆ సలహా చంద్రబాబుకు ఇవ్వడంతోనేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిషత్ ఎన్నికల ను బహిష్కరించడానికి పరోక్షంగా జేసీ దివాకర్ రెడ్డి కారణం. జేసీ దివాకర్ రెడ్డి తొలి నుంచి ఎన్నికలను బహిష‌్కరించాలని [more]

Update: 2021-04-18 14:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిషత్ ఎన్నికల ను బహిష్కరించడానికి పరోక్షంగా జేసీ దివాకర్ రెడ్డి కారణం. జేసీ దివాకర్ రెడ్డి తొలి నుంచి ఎన్నికలను బహిష‌్కరించాలని చెబుతూ వస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న ఆగడాలను ఎదుర్కొనలేమని, ఆర్థికంగా, కేసుల పరంగా ఇబ్బందులు పడటం వృధా అని జేసీ దివాకర్ రెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారు. అయినా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసినా తెలుగుదేశం పార్టీకి విజయం దక్కలేదు.

టీడీపీలోనే ఉండి…..

జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాల నుంచి తాను తప్పుకున్నానని చెబుతున్నా తాడిపత్రి, అనంతపురం రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నారు. వరస కేసులు తమ కుటుంబంపై నమోదవుతున్నా, ఆర్థికంగా తమను అధికార పార్టీ దెబ్బతీస్తున్నా ఉగ్గపట్టి పార్టీలోనే ఉన్నారు. మరే పార్టీలోకి వెళ్లలేక, టీడీపీలోనే ఉండి తమ రాజకీయ భవిష్యత్ ను తేల్చుకోవాలని జేసీ దివాకర్ రెడ్డి భావిస్తున్నారు. ఈనేపథ్యంలో పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఆయన చంద్రబాబుకు చెప్పారని తెలిసింది.

మున్సిపల్ ఎన్నికల సమయంలోనే….

ఎన్నికలను బహిష్కరించాలని మున్సిపల్ ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు జేసీ దివాకర్ రెడ్డి సూచించారట. అయితే ఆయన మాటను చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. ఫలితాల తర్వాత జేసీ దివాకర్ రెడ్డి మరోసారి చంద్రబాబుకు చెప్పారని తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసినందున నష్టపోయేది పార్టీయేనని, ఆర్థికంగా తాము ఎదుర్కొనడానికి సిద్ధంగా లేమని జేసీ దివాకర్ రెడ్డి సూచనతో ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.

మరింత మంది నేతలను….?

జేసీ దివాకర్ రెడ్డి చెప్పిన దాంట్లో లాజిక్ ను గమనించిన చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో పోటీ చేసి మరింత మంది నేతలను పార్టీకి దూరం చేసుకునేందుకు చంద్రబాబు ఇష్టపడలేదు. అందుకే జేసీ దివాకర్ రెడ్డి మాటకు చంద్రబాబు విలువ ఇచ్చారంటున్నారు. మొత్తం మీద జేసీ దివాకర్ రెడ్డి సలహాతోనే చంద్రబాబు పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉన్నారన్న కామెంట్స్ పార్టీలో వినపడుతున్నాయి.

Tags:    

Similar News