jc divakar reddy : కంట్రోల్ లో పెడుతున్నారే?

సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీలో ఎక్కడకక్కడ చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన వర్గీయులందరినీ కట్టడి చేయాలనే నిర్ణయానికి పార్టీ అధినాయకత్వం వచ్చింది. [more]

Update: 2021-10-25 12:30 GMT

సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీలో ఎక్కడకక్కడ చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన వర్గీయులందరినీ కట్టడి చేయాలనే నిర్ణయానికి పార్టీ అధినాయకత్వం వచ్చింది. పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ ను ఇప్పుడే కంట్రోల్ చేయలేకపోతే భవిష‌్యత్ లో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని చంద్రబాబు సయితం అంతర్గత సమావేశాల్లో అంగీకరిస్తున్నారు.

తమ నియోజకవర్గాల్లో….

జేసీ దివాకర్ రెడ్డి వర్గం తమ పార్లమెంటు నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా శింగనమల నియోజకవర్గంలో తమ వర్గానికి చెందిన బండారు శ్రావణికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కానీ స్థానిక నాయకత్వం బండారు శ్రావణిని వ్యతిరేకిస్తుంది. దీంతో చంద్రబాబు ఇక్కడ టూ మెన్ కమిటీని నియమించారు. టూ మెన్ కమిటీ పర్యటించి స్థానిక నేతల అభిప్రాయాలను సేకరిస్తుంది.

బండారు శ్రావణికి….

2019 ఎన్నికల్లో బండారు శ్రావణి ఇక్కడి నుంచి పోట ీచేసి ఓటమి పాలయ్యారు. ఈమె జేసీ వర్గీయురాలు. రిజర్వ్ డ్ నియోజకవర్గం కావడంతో నాటి ఎన్నికల ఖర్చంతా జేసీ బ్రదర్స్ భరించారు. అయితే ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా పార్టీలో మరొక గ్రూపు బయలుదేరింది. దీంతో జేసీ బ్రదర్స్ బండారు శ్రావణికి అనుకూలంగా వ్యూహాలు రచిస్తున్నారు. దీనిపై పార్టీ అధినాయకత్వం ఆలోచన మరోలా ఉంది.

కొత్త నేత కోసం….?

గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి యామినిబాల, కాంగ్రెస్ నుంచి శమంతకమణి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన శమంతకమణికి అప్పట్లో చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. అయితే ఆమె వైసీపీలో చేరిపోయారు. దీంతో ఇక్కడ కొత్త నేత కోసం అన్వేషణ జరుగుతుంది. ఎక్కువ మంది జేసీ వర్గానికి చెందిన బండారు శ్రావణిని వ్యతిరేకిస్తుండటంతో చంద్రబాబు కొత్తనేతకు అవకాశమిస్తారంటున్నారు. అదే జరిగితే జేసీ వర్గానికి బలమైన దెబ్బేనని చెప్పాలి.

Tags:    

Similar News