జేసీ కున్న క్లారిటీ.. బాబుకు లేకపోయెనే?
స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు. ఇది గ్యారంటీ. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఈ వ్యాఖ్యలు చేసింది [more]
స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు. ఇది గ్యారంటీ. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఈ వ్యాఖ్యలు చేసింది [more]
స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు. ఇది గ్యారంటీ. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు. టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి. జేసీ దివాకర్ రెడ్డికి ఉన్న క్లారిటీ టీడీపీ అధినేత చంద్రబాబుకు లేకపోయనే అన్న కామెంట్స్ పార్టీలోనే విన్పిస్తుండటం విశేషం. జేసీ దివాకర్ రెడ్డి ఏదైనా మాట్లాడితే అందులో లాజిక్ ఉంటుందంటారు. ఆవేశంగా మాట్లాడినా అందులో అర్థముంటుందంటారు.
నిమ్మగడ్డ వర్సెస్ సర్కార్…..
స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలని రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరుపుతామని, ఇందుకు సహకరించాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. అయితే కోరనా వైరస్ కారణంగా తాము ఎన్నికల నిర్వహణకు ముందుకు రాలేమని ప్రభుత్వం చెబుతోంది. అనేకమంది ప్రభుత్వ అధికారులు నేటికీ కరోనా విధుల్లో ఉన్నారని గుర్తు చేస్తుంది. అయితే జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ఏపీలో మార్చి వరకూ స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం కష్టమేనంటున్నారు.
కోర్టు కేసులతోనే…..
జేసీ దివాకర్ రెడ్డి చెబుతున్న రీజనేంటంటే… స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు ఒకే చెప్పినా ప్రభుత్వం ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది. సుప్రీంకోర్టులో కూడా తేడా వచ్చినా ఏకగ్రీవం అయిన నేతలో, నామినేషన్ దాఖలు చేసిన వారెవరైనా కోర్టును ఆశ్రయించి ఎన్నికల నిలుపుదలను కోరే అవకాశముంది. ఇప్పటికే అనేక చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. దీంతో పాటు కొందరు దీనిపై అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి.
న్యాయనిపుణులు సయితం…..
అందుకే స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టుల్లో కేసులు పుంఖాను పంఖాలుగా దాఖలయ్యే అవకాశాలున్నాయన్నది జేసీ దివాకర్ రెడ్డి అంచనా. కోర్టుల్లో కేసులు తేలేసరికి పుణ్యకాలం మొత్తం ముగిసిపోతుందని, నిమ్మగడ్డ ఇంటికి పోక తప్పదన్నది జేసీ దివాకర్ రెడ్డి అంచనా. ఒక రకంగా జేసీ చెప్పింది కరెక్టే. న్యాయపరంగా అనేక కేసులతో ఇది ఎప్పటికి తేలుతుందనేది చెప్పలేమని న్యాయనిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. సో నిమ్మగడ్డ ఇంటికి వెళ్లేంత వరకూ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని జేసీ దివాకర్ రెడ్డి క్లారిటీగా చెబుతున్నా, చంద్రబాబు మాత్రం ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిస్తుండటం హాస్యాస్పందంగా ఉందంటున్నారు.