టోటల్ గా జేసీ డిసైడ్ అయ్యారన్న మాట

రాయలసీమ జిల్లాలో రచ్చ రాజకీయాలకు జేసీ బ్రదర్స్ పెట్టింది పేరు. జేసీ ఫ్యామిలీ అంటేనే అంత అన్న టాక్ కూడా ఉంది. చంద్రబాబుతో పాటే 1978 నుంచి [more]

Update: 2020-12-19 06:30 GMT

రాయలసీమ జిల్లాలో రచ్చ రాజకీయాలకు జేసీ బ్రదర్స్ పెట్టింది పేరు. జేసీ ఫ్యామిలీ అంటేనే అంత అన్న టాక్ కూడా ఉంది. చంద్రబాబుతో పాటే 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా సెకెండ్ గ్రేడ్ లీడర్ గానే రాష్ట్ర రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి మిగలడం ఒక రాజకీయ విషాదం. దానికి ఆయన నోటి దురుసు ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. విభజన తరువాత కాంగ్రెస్ కి ఏపీలో ఠికాణా లేదని డిసైడ్ అయిన జేసీ దివాకర్ రెడ్డి తన ఫ్యామిలీతో సహా టీడీపీలోకి జంప్ చేశారు. అలా కలసి వచ్చి 2014 ఎన్నికల్లో తాను ఎంపీగా, తమ్ముడు ప్రభాకరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు.

టార్గెట్ అయ్యారుగా ..?

ఇక జేసీ దివాకర్ రెడ్డి నాడు నోరు జాగ్రత్తగా పెట్టుకుని ఉంటే ఇపుడు రాజకీయంగా తిప్పలు తప్పేవి ఉండేవి కావు. కానీ చంద్రబాబు మెచ్చుకోలు కోసం జగన్ని మావాడు అంటూనే జేసీ నానా మాటలూ అన్నారు. అవన్నీ చివరికి రివర్స్ లో బెడిసికొట్టి ఇపుడు జగన్ కి టార్గెట్ అయ్యారు. గత ఏడాదిన్నరగా జగన్ దెబ్బకు జేసీ ఫ్యామిలీ మొత్తం అన్ని వ్యాపారాలను మూసుకోవాల్సివచ్చింది. అంతే కాదు మనశ్శాంతి అన్నది కూడా లేకుండా పోయింది. తెల్లారిలేస్తే మీడియా ముందుకొచ్చి అయిన దాన్ని కానిదాన్ని ముడిపెట్టి సెటైర్లు వేసే జేసీ దివాకరరెడ్డి నోరు ఈ మధ్య పూర్తిగా మూగపోయింది.

కమలం గూటికే…?

తాను టీడీపీలోనే ఉంటానని, ఇండియాతో ఆక్రమిత కాశ్మీర్ ని మోడీ కలిపితే అపుడు బీజేపీలోకి చేరుతారన్ని గత ఏడాది ఇదే సమయంలో జేసీ దివాకరరెడ్డి మీడియా ముందు చెప్పి తెగ గొప్పలు పోయారు. పైగా 2024 నాటికి చంద్రబాబే సీఎం అంటూ చిలక జోస్యాలూ చెప్పారు. తాను ఇక రాజకీయ జీవితం చాలిస్తున్నట్లు మరో సందర్భంలో చెప్పుకున్నారు. ఇన్ని చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి ఇపుడు కమలం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారని అంటున్నారు. జగన్ దెబ్బకు తట్టుకోలేకనే జేసీ దివాకర్ రెడ్డి ఇలా పాత మాటలను గట్టు మీద పెట్టి మరీ కమల కరచాలనం చేస్తున్నారు అంటున్నారు.

బాబుకు దెబ్బేనా…?

ఇక చంద్రబాబుకు నోరున్న, పేరున్న నేత సీమ జిల్లాల్లో చూస్తే జేసీ దివాకర్ రెడ్డి ఒక్కరే. ఆయన బోల్డ్ గా మాట్లాడినట్లు కనిపించినా తాను అనుకున్నదే మాట్లాడుతారు. చంద్రబాబు మళ్ళీ సీఎం అవుతారు అని ఇప్పటిదాకా ధైర్యం చెప్పిన జేసీయే ఇపుడు పలాయనవాదంతో బీజేపీ నీడన చేరితే టీడీపీ కధ రాయలసీమలో కంచికి చేరినట్లేనని అంటున్నారు. మొత్తానికి జేసీ దివాకర్ రెడ్డి కమలం పువ్వు బాబు చెవిన పెట్టేసేందుకు రెడీ అయ్యారని, పోతూ పోతూ మరింతమందిని కూడా తన కూడా తీసుకెళ్తారని వస్తున్న ప్రచారంతో టీడీపీ శిబిరం అదురుతోందిట.

Tags:    

Similar News