వైసీలోకి చేరుదామనుకునే లోపే…?
అయిపోయింది! అనుకున్నదే జరిగిపోతోంది. అనంతపురం రాజకీయాల్లో మరీ ముఖ్యంగా టీడీపీ పాలిటిక్స్‌లో పెను కుదుపు ఏర్పడుతోంది. ఇప్పటికే సీమ జిల్లాల్లో పతనావస్థకు చేరువలో ఉన్న టీడీపీ.. ఇప్పుడు [more]
అయిపోయింది! అనుకున్నదే జరిగిపోతోంది. అనంతపురం రాజకీయాల్లో మరీ ముఖ్యంగా టీడీపీ పాలిటిక్స్‌లో పెను కుదుపు ఏర్పడుతోంది. ఇప్పటికే సీమ జిల్లాల్లో పతనావస్థకు చేరువలో ఉన్న టీడీపీ.. ఇప్పుడు [more]
అయిపోయింది! అనుకున్నదే జరిగిపోతోంది. అనంతపురం రాజకీయాల్లో మరీ ముఖ్యంగా టీడీపీ పాలిటిక్స్‌లో పెను కుదుపు ఏర్పడుతోంది. ఇప్పటికే సీమ జిల్లాల్లో పతనావస్థకు చేరువలో ఉన్న టీడీపీ.. ఇప్పుడు మరీ దారుణంగా మారిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తంగా పరిస్థితి దిగజారేలోపే ఎవరికి వారు తమ తమ దారులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత కొన్నాళ్లుగా ఊగిసలాడతో ఉన్న అనంతపురం రెడ్లు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేరున్న జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కుటుంబాల్లోనూ రాజకీయ సమరం ప్రారంభమైంది. నిన్న మొన్నటి వరకు తండ్రుల చాటు బిడ్డల్లా ఉన్న దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిలు.. సొంత దారులు వెతుక్కున్నారు.
వైసీపీ నుంచి పోటీ చేసేందుకు….
కాంగ్రెస్‌లో రాజకీయాలు చేసిన జేసీ కుటుంబం… దాదాపు మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లోనే చక్రం తిప్పింది. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీడీపీ సైకిల్ ఎక్కారు. ఈ క్రమంలోనే టీడీపీ తరఫున ఎంపీగా గెలిచిన దివాకర్ రెడ్డి.. ఏ పని చేసుకోవాలన్నా.. అధిష్టానంపై తనదైన శైలిలో పోరాటం చేయాల్సి వచ్చింది. దీనికితోడు.. తనకు పొగబెట్టేందుకు కొందరు నేతలు నియోజకవర్గంలోనే ఉండడం కూడా ఆయనకు నచ్చలేదు. అయినాకూడా సర్దుకు పోయారు. ఇక, గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి కుమారులు పోటీ చేశారు. వాస్తవానికి వారు వైసీపీ తరఫున రంగంలోకి దిగాలని అనుకున్నారు. వైసీపీ కూడా వైరాలను పక్కన పెట్టి టికెట్లు ఇచ్చేందుకు రెడీ అయింది.
వ్యాపారాలపై దెబ్బ పడటంతో…
అయితే, దివాకర్ రెడ్డి బలవంతంతోనే ఇద్దరూ టీడీపీ తరఫున పోటీ చేశారు. ఈ క్రమంలో ఓడిపోయారు. సరే! అప్పటి నుంచి కూడా మౌనంగా ఉన్న అస్మిత్, పవన్‌లు.. ఎప్పటికప్పుడు వైసీపీలో చేరుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో అన్నదమ్ములు ఇద్దరూ కూడా రియాక్ట్ కాలేదు. ఇక, దివాకర్‌రెడ్డి కూడా ఈ వార్తలను ఎప్పుడూ ఖండించలేదు. ఇక, ఇప్పుడు అధికారుల నుంచి వీరి ట్రావెల్స్ బిజినెస్‌కు తీవ్ర కష్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీటి నుంచి బయట పడాలంటే.. ప్రభుత్వ సాయం తప్పదని గ్రహించారు.
అరెస్ట్ తర్వాత…
పోనీ.. ఈ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు ఏమన్నా సాయం చేస్తారా ? అని ఇన్నాళ్లు ఎదురు చూశారు. కానీ, ఇప్పటి వరకు ఆయన పట్టించుకోలేదు. ఇక తాజాగా జేసీకి షాక్ తగిలింది. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బీఎస్-3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారని ఆర్టీఏ అధికారులు ఆరోపణలు చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి వీరిపై ట్రావెల్ వ్యాపారానికి సంబంధించి తీవ్ర ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక పార్టీ మారరంటూ….
ఇక కొద్ది రోజులుగా జేసీ వారసుల నుంచి పార్టీ మారాలని తండ్రులపై ఒత్తిళ్లు వస్తోన్న నేపథ్యంలోనే జేసీ బ్రదర్స్ ఇద్దరూ కూడా తమ కుమారుల ఇష్టానికి వదిలేశారు. దీంతో త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోవాలని అస్మిత్, పవన్‌లు నిర్ణయించుకున్నట్టుగా జేసీ తరఫున అనుచరులు భారీగా ప్రచారం చేస్తుండడం గమనార్హం. ఈ లోగానే వీరు అరెస్టు అయ్యారు. మరి జేసీ కుటుంబం పొలిటికల్ టర్న్ ఎలా ఉంటుందో ? చూడాలి.