గీర తగ్గక పోతే నార తీస్తారట

జేసీ ప్రభాకర్ రెడ్డి 2014లో ఎమ్మెల్యే. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఒక మున్సిపాలిటీకి ఛైర్మన్. అయినా జేసీ ప్రభాకర్ రెడ్డికి గీర ఏ మాత్రం తగ్గలేదు. [more]

Update: 2021-05-07 13:30 GMT

జేసీ ప్రభాకర్ రెడ్డి 2014లో ఎమ్మెల్యే. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఒక మున్సిపాలిటీకి ఛైర్మన్. అయినా జేసీ ప్రభాకర్ రెడ్డికి గీర ఏ మాత్రం తగ్గలేదు. తనను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాలో ఉన్నారు. అంతటితో ఆగకుండా డబ్బులు తీసుకుని ఓట్లేసిన వారికి పనులు చేయనని చెప్పడం ఆయన టెంపరితనానికి నిదర్శనం. ఇంతకీ జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడటం వల్లనే ఇలాంటి కామెంట్స్ చేశారా? అంటే అవుననే అనిపిస్తుంది.

పెద్దగా బలం లేదు…..

తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీకి పెద్దగా బలం లేదు. ఎన్నికల వేళ జేసీ ప్రభాకర్ రెడ్డి తన వార్డు సభ్యులను క్యాంప్ కు తరలించి కాపాడుకోగలిగారు. అయితే ఎంత కాలం వారిని కాపాడుకో గలరన్నది ప్రశ్న. వైసీపీ సభ్యులే తమ వైపు వస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి ధీమాగా చేసిన ప్రకటనలో కూడా వాస్తవం లేదు. ఎందుకంటే మరో ముగ్గురు సభ్యులు వైసీపీలో చేరితే మున్సిపల్ ఛైర్మన్ పదవి వైసీపీకి దక్కుతుంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ కౌన్సిలర్లు ఆ సాహసం చేయరు.

అన్ని వేళలా రక్షించుకోవడం….

అయితే తన పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్లకు గేలం వేస్తున్నారని మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి పసిగట్టినట్లే కన్పిస్తుంది. అన్ని వేళలా అందరినీ రక్షించుకోవడం కష్టమైన పనే. అలాగని వారి గొంతెమ్మ కోర్కెలను కూడా తీర్చడం జేసీ ప్రభాకర్ రెడ్డికి సాధ్యం కాని పని. ఇప్పుడిప్పుడే టీడీపీలో కూడా లుకలుకలు ప్రారంభమయ్యాయంటున్నారు. నిధులు పెద్దగా లేకపోవడం, జేసీ ప్రభాకర్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం కొందరికి నచ్చడం లేదు.

ఆచితూచి….

వైసీపీ కూడా వేచి చూసే ధోరణి అవలంబిస్తుంది. ఆపరేషన్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వాలి తప్పించి ఫెయిల్ కాకూడదని, ఫెయిల్ అయితే మరోసారి పార్టీ నాయకత్వం నుంచి తిట్లు తినాల్సి వస్తుందని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇది తెలిసే జేసీ ప్రభాకర్ రెడ్డి తన పదవికి నాలుగేళ్ల పాటు ఢోకా లేదని చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఆయన అనుకుంటున్నట్లు పదవిని కాపాడుకోవడం అంత సులువు కాదు. ఆయన తగ్గి ఉంటేనే కొంత ఫలితం ఉంటుందంటున్నారు.

Tags:    

Similar News