జేసీ పై మూకుమ్మడి దాడి.. టీడీపీ స్ట్రాటజీ అదేనా?

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పై సొంత పార్టీ నేతలే ఫైర్ అవుతున్నారు. పార్టీని బలహీన పర్చే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. ఒకరు కాదు ఇద్దరు [more]

Update: 2021-09-12 14:30 GMT

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పై సొంత పార్టీ నేతలే ఫైర్ అవుతున్నారు. పార్టీని బలహీన పర్చే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలందరూ జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చినట్లు సీన్ చూస్తే అర్థమవుతుంది. జేసీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలన్నదే టీడీపీ థ్యేయంగా కన్పిస్తుంది. జేసీకి వ్యతిరేకంగా మూకుమ్మడి మాటల దాడికి దిగడం చూస్తే జేసీ ఇక ఒంటరి వారే అని అనిపించక మానదు.

ఆధిపత్యం కోసం….

అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ తమ ఆధిపత్యం కొనాసాగాలనుకుంటారు. అందులో భాగంగా వారు వేసే ప్రతి రాజకీయ అడుగు ఉంటుంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఓటమి పాలయినా తాడిపత్రిలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచి తన సత్తా చూపారు .అప్పటి నుంచి వారి యాటిట్యూడ్ మారినట్లు కన్పిస్తుంది. జిల్లాలో తమ పెత్తనమే కొనసాగాలని జేసీ ప్రభాకర్ రెడ్డి గట్టిగా భావిస్తున్నట్లే ఉంది.

అందరూ ఏకమై…

అయితే జేసీ ప్రభాకర్ రెడ్డికి అంత సులువుగా పెత్తనం ఇచ్చే అవకాశం లేదని టీడీపీ నేతలు ఇన్ డైరెక్ట్ గా తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లాలో కులాలకతీతంగా లీడర్లందరూ జేసీకి వ్యతిరేకంగా గళమెత్తారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి దగ్గర నుంచి పల్లె రఘునాధరెడ్డి వరకూ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసింది తప్పు అని సూటిగా చెప్పేశారు. జేసీ కుటుంబమే టీడీపీకి పెద్ద సమస్య అని ప్రభాకర్ చౌదరి అనడం ఆ కుటుంబంపై ఎంత కసి ఉందో చెప్పకనే తెలుస్తుంది.

కాల్వకు అండగా

టీడీపీ నేత బీకే పార్థసారధి, మాజీ మంత్రి పరిటాల సునీత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్, పల్లె రఘునాధరెడ్డి వంటి నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఒకసారి జగన్ ను పొగడటం, మరొకసారి టీడీపీ నేతలను తిట్టడం జేసీ ప్రభాకర్ రెడ్డి పరిపాటిగా మారింది. నేతలంతా కాల్వ శ్రీనివాసులుకు అండగా నిలబడ్డారు. పార్టీని బలహీనపర్చాలనే జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీ నేతలను టార్గెట్ చేశారంటున్నారు. మొత్తం మీద అనంతపురం జిల్లా టీడీపీలో జేసీ కుటుంబం ఒంటరి అని చెప్పక తప్పదు.

Tags:    

Similar News