Jc prabhakar reddy : అందుకే వాళ్లకి ఎక్కడో కాలేది
అసలే కోతి.. ఆపైన… అన్నట్లు ఉంది తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పరిస్థితి. తన వర్గం వారిని కాపాడుకునేందుకు ఆయన పార్టీలో కష్టాలు కొని [more]
అసలే కోతి.. ఆపైన… అన్నట్లు ఉంది తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పరిస్థితి. తన వర్గం వారిని కాపాడుకునేందుకు ఆయన పార్టీలో కష్టాలు కొని [more]
అసలే కోతి.. ఆపైన… అన్నట్లు ఉంది తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పరిస్థితి. తన వర్గం వారిని కాపాడుకునేందుకు ఆయన పార్టీలో కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. పార్టీలో రచ్చ అవుతుందని తెలిసినా ఆయన ఏ మాత్రం సందేహించడం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి పరిస్థిితి చూస్తుంటే పార్టీ నేతలతో తాడో పేడో తేల్చుకునేందుకే సిద్ధమయినట్లు కనిపిస్తుంది. ఇటీవల ఆయన పుట్టపర్తి నియోజకవర్గంలో చేసిన పర్యటన మరోసారి కాక రేపింది.
పొంతన లేని కామెంట్స్ తో….
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన ఇక ఆగేటట్లు కన్పించడం లేదు. చంద్రబాబు మీద వీర విధేయత ప్రకటిస్తూనే తాను టీడీపీ వల్ల గెలవలేదన్నారు. మరోవైపు జగన్ ను కూడా ప్రశంసలతో ముంచెత్తడం జేసీ ప్రభాకర్ రెడ్డికి మాత్రమే చెల్లింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో మంటలు రేపాయి. కాల్వ శ్రీనివాసులుతో పాటు పల్లె రఘునాధరెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బాబును పొగుడుతూనే…
అధిష్టానం సున్నిత హెచ్చరికలు జారీ చేసినా జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం లెక్క చేయలేదు. మరోసారి ఆయన పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో కూడా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యమన్న జేసీ ప్రభాకర్ రెడ్డి అందుకోసం అందరూ పనిచేయాలన్నారు. పార్టీకి దూరంగా ఉన్న నేతలను తిరిగి తీసుకురావడానికే తాను పుట్టపర్తి వచ్చానని ఆయన చెప్పారు. పుట్టపర్తిలో జేసీ ప్రభాకర్ రెడ్డి హడావిడి చేశారు.
పల్లె ఆగ్రహం…
పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి పార్టీ ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఆయనకు తెలియకుండా జరిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి పర్యటన సహజంగానే ఆయనకు ఆగ్రహం కల్గించింది. దీనిపై అధినాయకత్వానికి ఫిర్యాదు చేయనున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నియోజకవర్గానికే పరిమితమైతే బాగుంటుంది. వీరు ఇతర నియోజకవర్గాల్లో వేలుపెట్డడం, ఇటీవలే పల్లె పై విమర్శలు చేసి అదే నియోజకవర్గంలో పర్యటించి జేసీ ప్రభాకర్ రెడ్డి తన తీరు ఇంతేనని పార్టీకి చెప్పకనే చెప్పేశారు.