చేతకానితనం నవ్వుల పాలు చేసిందా?
డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఇంటా బయటా ఆయన చాలాదూకుడుగా ఉండేవారు. ఏ విషయంలో అయినా ‘అమెరికా ఫస్ట్’ అన్న నినాదంతో ముందుకు సాగేవారు. ఈ విధానం కొన్ని [more]
డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఇంటా బయటా ఆయన చాలాదూకుడుగా ఉండేవారు. ఏ విషయంలో అయినా ‘అమెరికా ఫస్ట్’ అన్న నినాదంతో ముందుకు సాగేవారు. ఈ విధానం కొన్ని [more]
డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఇంటా బయటా ఆయన చాలాదూకుడుగా ఉండేవారు. ఏ విషయంలో అయినా ‘అమెరికా ఫస్ట్’ అన్న నినాదంతో ముందుకు సాగేవారు. ఈ విధానం కొన్ని స్దందర్భాల్లో ఆయనకు ప్రతికూలతలు తెచ్చిపెట్టాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. అగ్రరాజ్య అధినతేగా ఉండాల్సిన సంయమనం, నిగ్రహం లేదన్న వాదన వినిపించింది. తన తొందరపాటు వల్ల వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కొన్నారు. అంతర్జాతీయంగా అమెరికా నవ్వుల పాలైంది. ఎన్నికల్లో ట్రంప్ పరాజయానికి ఇదీ ఒక కారణం. అదే సమయంలో డెమొక్రటిక్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జో బైడెన్ అనుభవం, నిగ్రహం, సంయమనం, ఆచితూచి వ్యవహరించే తీరును చూసి ప్రజలు ఆయనకు పట్టం కట్టారు.
విదేశీ వ్యవహారాల్లో నిపుణుడని….
బరాక్ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఆయన తరఫున బైడెన్ విదేశీ వ్యహారాలను చక్కబెట్టేవారు. అంతర్జాతీయ వ్యవహరాలల్లో బైడెన్ నిపుణుడని డెమొక్రటిక్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రచారం చేసింది. ఈ అనుభవం అక్కరకు వస్తుందని గత ఏడాది నవంబరు లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. ఈ ఏడాది జనవరి 20న అధికార పగ్గాలు చేపట్టిన బైడెన్ విదేశాంగ విధానానికి పదునుపెట్టి అతంర్జాతీయంగా దేశ ప్రతిష్టను పెంచుతారని ప్రజలు భావించారు. ఈ దిశగా కొంతవరకు విజయం సాధించారు కూడా. అయితే అప్ఘాన్ వ్యవహారంలో బైడెన్ వ్యవహరించిన తీరుపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైైఫల్యంగా…..
అప్ఘాన్ నుంచి దళాల ఉపంహరణకు ముందు తరవాతా ఆయన వ్యవహరించిన తీరు అమెరికన్లకూ మింగుడుపడటం లేదు. ఇది జో బైడెన్ పరాజయంగా అంతర్జాతీయ మీడియా ఘోషిస్తోంది. ఆయన అచేతనంగా వ్యవహరించి ప్రపంచంలో దేశ పరువు, ప్రతిష్టలను మంటగలిపారని అమెరికా సమాజం ధ్వజమెత్తుతోంది. వియత్నాం యుద్ధంలో ఓటమితో అఫ్గాన్ పరిస్థితిని పోల్చిచూస్తోంది. దళాల విరమణ సంగతిని పక్కనపెడితే ముఖ్యంగా కాబూల్ విమానాశ్రయంలో చోటు చేసుకున్న
బాంబుపేలుళ్ల ఘటనను బైడెన్ వైఫల్యానికి పరాకాష్టగా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు పేర్కొంటున్నారు. తాలిబన్లను నియంత్రించలేక చేతులెత్తేశారని ధ్వజమెత్తుతున్నారు. తద్వారా అంతర్జాతీయంగా అమెరికా పేరు ప్రతిష్టలు మసక బారాయన్న వాదనను విమర్శకులు గట్టిగా వినిపిస్తున్నారు.
నిర్ణయం ట్రంప్ దే అయినా?
వాస్తవానికి అప్ఘాన్ నుంచి బలగాల ఉపసంహరణ బైడెన్ తీసుకున్న నిర్ణయం కాదు. ట్రంప్ హయాంలోనే ఈ నిర్ణయం ఆమోదం పొందింది. అధ్యక్ష ఎన్నికల్లో ఇది చర్చనీయాంశం అయింది. ట్రంప్, బైడెన్ ఇద్దరూ దీని గురించి సవివరంగా ప్రస్తావించారు. కానీ బలగాల ఉపసంహరణ ప్రక్రియను బైడెన్ సమర్థంగా పర్యవేక్షించలేకపోయారు. ఈ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. ముందుచూపూ కొరవడింది. బలగాలను ఉపసంహరించు కోవాలనుకున్న వెంటనే అప్ఘాన్ లోని తమ పౌరులను, అధికారులను, సైన్యాన్ని రప్పించేందుకు ప్రణాళిక కొరవడింది. ఇందుకోసం ప్రత్యేక మిషన్ చేపట్టడం కానీ, ఒక ప్రత్యేక అధికారిని నియమించడం గానీ చేయలేదు. అంతా దైవాధీనం అన్నట్లు వ్యవహారం నడిపారు.
చరిత్ర తెలిసీ…..
తాలిబన్ల గత చరిత్ర తెలిసినప్పటికీ వారిని పూర్తిగా నమ్మడం పెద్ద పొరపాటు. ఊహించినదాని కంటే ముందే తాలిబన్లు అప్ఘాన్ ను కైవశం చేసుకుంటారని సామాన్యులు సైతం అంచనా వేశారు. కానీ బైడెన్ యంత్రాంగం ఈ విషయాన్ని పసిగట్టలేకపోయింది. తమ వైఫల్యం ఏమీ లేదని, అఫ్గాన్ సేనల చేతగానితనమే ఇందుకు కారణమన్న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సూల్లివాన్ వాదనలో పస లేదు. అఫ్గాన్ సేనలు సరైనవయితే అమెరికాకు అక్కడేం పని అన్న ప్రశ్నకు సరైన జవాబు లేదు.
-ఎడిటోరియల్ డెస్క్