కరెక్ట్ మొగుడే దొరికాడంటారా?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు కేవలం ఆదే శానికి సంబంధించిన అంశమే కాదు. యావత్ అంతర్జాతీయ సమాజం వాటిని ఆసక్తిగా గమనిస్తుంది. ఆ ఎన్నికలు అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు, [more]
అమెరికా అధ్యక్ష ఎన్నికలు కేవలం ఆదే శానికి సంబంధించిన అంశమే కాదు. యావత్ అంతర్జాతీయ సమాజం వాటిని ఆసక్తిగా గమనిస్తుంది. ఆ ఎన్నికలు అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు, [more]
అమెరికా అధ్యక్ష ఎన్నికలు కేవలం ఆదే శానికి సంబంధించిన అంశమే కాదు. యావత్ అంతర్జాతీయ సమాజం వాటిని ఆసక్తిగా గమనిస్తుంది. ఆ ఎన్నికలు అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు, అనుసరించే విధానాలు అంతర్జాతీయ యవనికపై విశేష ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకనే పేద దేశాలతోపాటు, పెద్ద దేశాలు, అమెరికా మిత్ర, శత్రుదేశాలు ఈ ఎన్నికలపై ఎప్పుడూ ఒక కన్నేసి చూస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలను పరోక్షంగా ప్రపంచ ఎన్నికలుగా పరిగణించవచ్చు. ఈ ఏడాదిన నవంబరు 3న జరగనున్న అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికకు సంబంధించి స్పష్టత వచ్చింది. రిపబ్లకన్ పార్టీ అభ్యర్ధిగా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ పేరు ఏనాడో ఖరారైంది. ఆయన పార్టీలోని ముగ్గురు అభ్యర్ధులను కాదని అవలీలగా అభ్యర్ధిత్వాన్ని చేజిక్కించుకున్నారు. పరోక్షంగా ప్రచారాన్ని కుాడా ప్రారంభించారు.
జోబిడెన్ వైపే….
ఇక మిగిలింది డెమెుక్రటిక్ పార్టీ అభర్ధిత్వం. ఆపార్టీ తరపున ఎవరు అభర్ధిత్వం చేజిక్కించుకుంటారన్న అంశంపై ఇప్పటివరకు ఉత్కంఠ నెలకొంది. అభ్యర్ధిత్వం కోసం వెర్మాంట్ (Vermant) సెనెటర్ బెర్ని శాండర్స్ (Berney Sanders) మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ల మధ్య గట్టి పోటీ జరిగింది. పార్టీలోని మెజారిటీ నాయకుల మద్దతు కూడ గట్టేందుకు వీరు విపరీతంగా శ్రమించారు. ఈ పోటీలో చివరకు జో బిడెన్ విజయం సాధించారు. బెర్ని శాండర్స్ పోటీనుంచి వైదొలగడంతో జోబిడెన్ అభ్యర్ధిత్వానికి మార్గం సుగమమైంది. శాండర్స్ అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వానికి పోటీపడటం ఇది రెండోసారి. 2016 లో కుాడా పోటీపడినప్పటికి విజయం సాధించలేకపోయారు. 1941 సెప్టెంబరులో జన్మించిన శాండర్స్ ఉదారవాది. చికాగో విశ్వవిద్యాలయంలో బీఏ చదివారు. జో బిడెన్ కు సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. 1942 లో జన్మించిన బరాక్ ఒబామా హయాంలో దేశ 47వ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2009 నుంచి 2017 వరకు ఎనిమిదేళ్ళపాటు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. న్నాయశాస్త్రాన్ని అభ్యసించారు. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన తాను మరోమెట్టు ఎక్కువే అధ్యక్ష పదవిని అందుకో గలిగితే తన జీవిత లక్ష్యం నెరవేరుతుందన్న ఆశాభావంలో ఉన్నారు. భారత దేశంలో పార్టీ టిక్కెట్ తెచ్చుకోవడం ఎంతకష్టమెా అమెరికాలో పార్టీ అధ్యక్ష అభ్యర్ధిత్వం సాధించడం అంతకుమించిన కష్టం. ఎక్కడైనా, ఏ దేశంలో అయినా అభ్యర్ధిత్వం టిక్కట్ సాధిస్తే సగం విజయం లభించినట్లే. ప్రత్యర్ధిని ఢీకొనడం రెండో దశకు సంబంధించింది.
అంత ఆషామాషీ కాదు….
పార్టీలో జరిగే అంతర్గత పోటీ ఆషామాషీగా ఉండదు. దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించే ప్రక్రియలో ఎలాంటి విధానాలు అవలంబిస్తారు? ఎలాంటి పధకాలు అమలు చేస్తారు? సంక్షేమం, వైద్య, విద్యారంగాలు, విదేశాంగ విధానాలపై అభ్యర్ధుల మధ్య విస్తృత చర్చ జరుగుతుంది. పార్టీ నాయకులను ఒప్పించడం, మెప్పించడం అత్యంత సంక్లిష్టమైన విషయం. ఈ చర్చ నెలల తరబడి నడుస్తుంది. అగ్రరాజ్య హోదాను కాపాడుకోవడం, మిత్రదేశాలకు సాయం, శత్రుదేశాలను చికాకు పరచడం, రష్యా, చైనా, భారత్ వంటి దేశాలతో సన్నిహిత సంబంధాలపై అనుసరించే వ్యూహాన్ని వివరించాల్సి ఉంటుంది. దేశం ఎదుర్కొనే అంతర్గత సమస్యలను అధిగమించడం సైనికంగా దీటుగా ఉండటం, విద్య, వైద్య, ఆరోగ్య, సంక్షేమ పధకాలను సమర్ధంగా అమలు చేయడంపై కుాడా అభ్యర్ధులు తమ విధానాలను స్పష్టీకరించాల్సి ఉంటుంది.
బిడెన్ పై అనేక…?
అభ్యర్ధిత్వం కోసం జరిగిన పోరులో బెర్ని శాండర్స్ ముందంజలో ఉన్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. స్వతహాగా ఆయన ఉదారవాది వామపక్ష భావజాలం కొంత ఉంది. విధానాలపైనే మాట్లాడుతారు తప్ప , వ్యక్తిగత విమర్శలకు దుారంగా ఉంటారు. హుందాతనంగా వ్యవహరిస్తారు. కార్పోరేట్ వ్యతిరేకి, ఈ ఏడాది జులై వరకు అభ్యర్ధిత్వం కోసం పోరు జరిపే అవకాశం ఉన్నప్పటికి ముందుగానే బరి నుంచి నిష్క్రమించారు. శాండర్స్ వైదొలగగానే స్టాక్ మార్కెట్ కళకళ లాడింది. దీనిని బట్టి ఆయన వైఖరిని అర్ధంచేసుకోవచ్చు. శాండర్స్ కు అధికారం దక్కితే తమ ప్రయెాజనాలు దెబ్బతింటాయని బహుళజాతి సంస్ధలు భావించి ఆయనకు వ్యతిరేకంగా పావులు కదిపారు. ఇక జో బిడెన్ వివాదస్పదుడు. ఆయన కుటుంబాన్ని అనేక కుంభకోణాలు చుట్టుముట్టాయి. ఒక సెనెట్ ఉద్యోగినిపై లైంగిక దాడికి పాల్పడ్గారన్న ఆరోపణ ఉంది. విధానపరంగా జో బిడెన్ మధ్యేవాది. పార్టీలోని వృద్ధతరం ఓటర్లు బిడెన్ వైపే నిలబడ్డారు. పార్టీని ఆయన గట్టెక్కస్తాడని భావించారు. మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకునేందుకు బిడెన్ సైతం సంక్షేమ పధకాల గురించి మాట్లాడుతున్నారు. ఉచితవైద్యం పరిధి లోకి మరింత మందిని తెచ్చేందుకు వయెా పరిమితిని 60 కి తగ్గిస్తానని, అల్పాదాయ, మధ్య ఆదాయ వర్గాల విద్యార్ధుల రుణాలల్లో కొంతమేర మాఫీచేస్తానని చెబుతున్నారు. దేశాన్ని కలవరపరస్తున్న కరోనాపై నిర్దిష్ట విధానాన్ని ప్రకటించలేదు. పార్టీ అభ్యర్ధిత్వాన్ని చేజిక్కించుకున్న బిడెన్ ఇప్పుడు అధ్యక్ష పదవిని కైవసం చేసుకునేందుకు కృషి చేస్తున్నారు.
-ఎడిటోరియల్ డెస్క్