Jogi ramesh : జోగికి చివరకు బూడిదే మిగిలిందా?

రాజకీయాల్లో సానుభూతి బాగా పనిచేస్తుంది. ప్రధానంగా తెలుగు ప్రాంతాల్లో అయ్యో అని ఓటేసేవారే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు 70ఏళ్ల వయసు దాటిన చంద్రబాబుకు సానుభూతిని వైసీపీ నేతలే [more]

Update: 2021-09-17 13:30 GMT

రాజకీయాల్లో సానుభూతి బాగా పనిచేస్తుంది. ప్రధానంగా తెలుగు ప్రాంతాల్లో అయ్యో అని ఓటేసేవారే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు 70ఏళ్ల వయసు దాటిన చంద్రబాబుకు సానుభూతిని వైసీపీ నేతలే తెప్పించి ఆయనను బలోపేతం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన నిర్వాకానికి చంద్రబాబు కు బోలెడంత సింపతీ వచ్చింది. చంద్రబాబు నివాసం ముట్టడికి జోగిరమేష్ పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది?

నివాసానికే పరిమితమై…

అయ్యన్న పాత్రుడు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చెత్త పాలన అన్నారు. అనరాని మాటలు అన్నారు. కానీ అయ్యన్న పాత్రుడు అన్న కామెంట్స్ కు లభించని మైలేజీ జోగి రమేష్ దూకుడుతో చేసిన వ్యవహారంలో లభించినట్లయింది. చంద్రబాబు జనంలోకి రావడం మానుకున్నారు. ఆయన కుమారుడు లోకేష్ ను పంపుతున్నారు. ఆయన ఉండవల్లి లోకి కరకట్ట మీద ఉన్న నివాసానికే పరిమితమయ్యారు. జూమ్ మీటింగ్ లు, టెలికాన్ఫరెన్స్ లతోనే సరిపెడుతున్నారు.

మాజీ సీఎం ఇంటి ముట్టడికి….

పార్టీలో విభేదాలను పరిష్కరించడానికే చంద్రబాబుకు సమయం సరిపోతుంది. అలాంటి చంద్రబాబు జనంలోకి రాకుండానే మేలు చేకూర్చారు జోగి రమేష్. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలియజేయడానికే జోగి రమేష్ వెళ్లారు. కానీ అక్కడ టీడీపీ శ్రేణులు ఉండటంతో బాహాబాహీ తలపడ్డారు. రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో జోగి రమేష్ కారు అద్దం ధ్వంసమయినా హైలెట్ అయింది టీడీపీ నేతలే.

కిలో మీటరు దూరంలోనే….

చంద్రబాబును చంపేసేందుకే జోగి రమేష్ వచ్చారని టీడీపీీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజానికి ఉండవల్లి కరకట్ట నివాసానికి చేరుకోవాలంటే రోడ్డు మీద కిలోమీటరుపైగానే నడచి చంద్రబాబు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండటంతో కిలోమీటరు ముందే ఎవరినైనా ఆపేస్తారు. చంద్రబాబు నివాసానికి దూరంగా జరిగిన వ్యవహారాన్ని టీడీపీ తెలివిగా తమకు అనుకూలంగా మలుచుకోగలిగింది. జోగి రమేష్ తన మంత్రి పదవి కోసమే బాబు నివాసం ముట్టడికి వెళ్లారంటున్నారు. దీంతో అది కూడా నెరవేరే అవకాశం కన్పించడం లేదు.

Tags:    

Similar News