గాజు గదిలో కూర్చున్న దెవరు? సంకల్పం ఉంటే?
సుప్రీంకోర్టు ప్రభుత్వ బందీ కాదు.. ఈ వ్యాఖ్యలు అత్యున్నత న్యాయస్థానం చేసింది. ఈ వివాదంలో రెండు విషయాలున్నాయి. ఒకటి వలసకూలీల సంక్షేమం. రెండోది ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య [more]
సుప్రీంకోర్టు ప్రభుత్వ బందీ కాదు.. ఈ వ్యాఖ్యలు అత్యున్నత న్యాయస్థానం చేసింది. ఈ వివాదంలో రెండు విషయాలున్నాయి. ఒకటి వలసకూలీల సంక్షేమం. రెండోది ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య [more]
సుప్రీంకోర్టు ప్రభుత్వ బందీ కాదు.. ఈ వ్యాఖ్యలు అత్యున్నత న్యాయస్థానం చేసింది. ఈ వివాదంలో రెండు విషయాలున్నాయి. ఒకటి వలసకూలీల సంక్షేమం. రెండోది ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య ఘర్షణ – ఆధిపత్య పోరు.
వలసకూలీలకు….
ఇందులో మొదటి అంశంలో వలసకూలీలకు న్యాయం జరగాలి. లాక్ డౌన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వలస కూలీలను ప్రభుత్వం, పాలకులు పరిగణలోకి తీసుకోకపోవడాన్ని నిరసించాలి. వలస కూలీలకు సంబంధించి వారిని తమ స్వస్థలాలకు పంపడమో లేక వారికి సరైన సదుపాయాలు కల్పించడమో జరిగి ఉండాల్సింది. ఈ పనులు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం.
ఘర్షణ జరుగుతోందా?
రెండోది న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తికి సంబంధించింది. “సుప్రీం కోర్టు ప్రభుత్వ బందీ కాదు” అని ధర్మాసనం చెప్పేవరకూ వచ్చిందంటే రెండు వ్యవస్థల (జ్యూడిషరీ మరియు పార్లమెంటు) మధ్య ఘర్షణ జరుగుతోంది అని అర్ధం చేసుకోవాల్సి ఉంది. ఈ ఘర్షణ మంచిది కాదు కానీ ఇది ఇప్పటిది కాదు. “గాజు గదుల్లో కూర్చున్న న్యాయమూర్తులకు సామాజిక పరిస్థితులు, ప్రజల అవసరాలు అర్ధం కావు,” అని అప్పట్లోనే తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వ్యాఖ్యానించారు.
ఇందిరాగాంధీ సయితం…..
ఆ తర్వాత ఇందిరా గాంధీ కూడా అనేక సందర్భాల్లో న్యాయవ్యవస్థతో ఘర్షణ వైఖరి అవలంబించారు. ఒక దశలో కోర్టుకు, తన కాబినెట్ కు తేడాలేకుండా చేయాలనీ చూశారు. అదృష్టం ఏమంటే సుప్రీం కోర్టు “extended cabinet” గా మారకుండా తన స్వయంప్రతిపత్తిని కాపాడుకుంది. ఇప్పుడు ప్రజల సామాజిక అవసరాలు గుర్తించిన న్యాయమూర్తులు పరిష్కారం అడుగుతుంటే పాలకులు కోర్టు గొంతు మూసే ప్రయత్నాలు చేస్తున్నట్టు నేటి ధర్మాసనం చేసిన వ్యాఖ్య తెలియజేస్తోంది.
సంకల్పం ఉండాలి…
జోడెద్దుల్లా పనిచేయాల్సిన రెండు వ్యవస్థలు (లెజిస్లేచర్ & జ్యూడిషరీ) ఇలా ఘర్షణ పూరిత వైఖరికి దిగడం ఆరోగ్యకరం కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా సంక్షేమం రెండూ ప్రాధమికమే. ప్రభుత్వం కొంత ముందు చూపుతో పనిచేసి ఉంటే, వలస కార్మికులను వారి స్వస్థలాలకు ముందుగానే తరలించి ఉంటే లేదా లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత అయినా ఈ పని చేసి ఉంటే కోర్టు ఇలా మొట్టికాయలు వేయాల్సి వచ్చేది కాదు. గాజు గదిలో ఎవరు కూర్చున్నా బయట దృశ్యాలు కనిపిస్తాయి. చూడాలనే సంకల్పం ఉండాలి.
-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్