Junior ntr : జూనియర్ కోసం జట్లు జట్లుగా…?
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగాలేదు. చంద్రబాబు, లోకేష్ మాటలను ప్రజలు విశ్వసించడం లేదు. ఎన్నికల హామీ ఇచ్చినా జనం వాటిని సీరియస్ గా తీసుకుంటారన్న [more]
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగాలేదు. చంద్రబాబు, లోకేష్ మాటలను ప్రజలు విశ్వసించడం లేదు. ఎన్నికల హామీ ఇచ్చినా జనం వాటిని సీరియస్ గా తీసుకుంటారన్న [more]
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగాలేదు. చంద్రబాబు, లోకేష్ మాటలను ప్రజలు విశ్వసించడం లేదు. ఎన్నికల హామీ ఇచ్చినా జనం వాటిని సీరియస్ గా తీసుకుంటారన్న గ్యారంటీ లేదు. అయితే ఈసారి గెలుపు టీడీపీకి అవసరం. లేకుంటే పార్టీ మనుగడే కష్టమవుతుంది. అందుకే అన్ని కోణాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ ప్రచారానికి తీసుకు వచ్చే ప్లాన్ చేస్తున్నారు.
పార్టీ అంటే ప్రేమ….
జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు. ఆయనకు సినిమాల్లో మంచి భవిష్యత్ ఉంది. రాజకీయాలు అంటే ఆయనకు అసలు పడటం లేదు. దీంతో ఎన్నిసార్లు మీడియా ప్రశ్నించినా ఇది సమయం కాదని దాటవేస్తూ జూనియర్ ఎన్టీఆర్ తప్పించుకుంటున్నారు. అయితే ఆయనకు తెలుగుదేశం పార్టీ అంటే వల్లమాలిన ప్రేమ. తన తాత స్థాపించిన పార్టీ పది కాలాల పాటు బాగుండాలని జూనియర్ ఎన్టీఆర్ కోరుకుంటారు.
సినీ పెద్దలను….
అదే బలహీనతను ఇప్పుడు చంద్రబాబు సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎక్కడకు వెళ్లినా జూనియర్ ఎన్టీఆర్ రావాలని చంద్రబాబు ఎదుటే ప్లకార్డులు కన్పిస్తున్నాయి. దీంతో ఆయన పక్కాగా జూనియర్ ను రింగ్ లోకి లాగేందుకు సిద్దమయ్యారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సినీ పరిశ్రమ మరింత కష్టాల్లో పడింది. సినిమా టిక్కెట్లు ప్రభుత్వమే సొంతంగా విక్రయించాలనుకోవడం, బెనిఫిట్ షో, స్పెషల్ షోలను రద్దు చేయడం వంటివి చిత్ర పరిశ్రమకు నచ్చడం లేదు. దీంతో కొందరు సినీ ప్రముఖులను జూనియర్ ఎన్టీఆర్ వద్దకు పంపాలని నిర్ణయించారని తెలిసింది. సినీ పరిశ్రమలో ఇప్పటికీ కొందరు పెద్దల మాటను జూనియర్ గౌరవిస్తారు.
రాజకీయ ప్రముఖులను….
ఇక రాజకీయంగా కూడా కొందరు పెద్దలను చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ వద్దకు పంపాలని నిర్ణయించుకున్నారు. విడతల వారీగా ఈ కార్యక్రమం ఉంటుంది. కమ్మ సామాజికవర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు, సీనియర్ ఎన్టీఆర్ తో అనుంబధం ఉండి పార్టీ పెట్టి ఇప్పుడు కాలక్షేపం చేస్తున్న ఒక పెద్దాయనను జూనియర్ వద్దకు రాయబారం పంపాలని భావిస్తున్నారు. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి తీసుకురావాలని చంద్రబాబు కూడా గట్టిగా భావిస్తున్నారు. పరిమితమైన చోట ఆయన ప్రచారం ఉండేలా ప్లాన్ చేయాలని నిర్ణయించారు. మరి జూనియర్ ఇందుకు అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాలి.