ఈయన సీజే అవుతారా? అడ్డంకి అదేనా?

ఎన్వీ రమణ.. మన తెలుగు వాడు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. అన్నీ కలసి వస్తే ఆయన త్వరలోనే చీఫ్ జస్టిస్ అవుతారు. అయితే ఎన్వీ రమణకు ఆ [more]

Update: 2021-03-24 03:30 GMT

ఎన్వీ రమణ.. మన తెలుగు వాడు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. అన్నీ కలసి వస్తే ఆయన త్వరలోనే చీఫ్ జస్టిస్ అవుతారు. అయితే ఎన్వీ రమణకు ఆ ఛాన్స్ దక్కుతుందా? ఉత్తరాది వారిని వదిలి గుజారాతీ భాయ్ లు దక్షిణాదికి అవకాశమిస్తారా? అన్న చర్చ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయవాదుల్లో సీనియర్ గా ఉన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఎన్వీ రమణ అంచెలంచెలుగా ఎదిగి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు.

సీనియారిటీ ప్రకారం…

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చీఫ్ జస్టిస్ బాబ్డేకు లేఖ రాసింది. ప్రస్తుతమున్న చీఫ్ జస్టిస్ బాబ్డే ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. తదుపరి చీఫ్ జస్టిస్ పేరును సిఫార్సుచేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. నిజానికి ఇప్పుడున్న వారిలో సీనియర్ జస్టిస్ ఎన్వీ రమణ మాత్రమే. సీనియారిటీ ప్రకారం చీఫ్ జస్టిస్ పదవి ఆయనకే దక్కాల్సి ఉంది. సీజే ప్రతిపాదించిన పేరును కేంద్ర ప్రభుత్వం కొలిజియానికి పంపితే ఫైనల్ అయినట్లే.

జగన్ లేఖతో….

అయితే ఇక్కడ తిరసకాసు ఉంది. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. ఆ లేఖ న్యాయవర్గాల్లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు పెద్దయెత్తున అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని, దీనిపై విచారణ జరుగుతుంటే అడ్డుకుంటున్నారని జగన్ లేఖ రాశారు. దీనిపై దేశ వ్యాప్తంగా జగన్ పై విమర్శలు విన్పించాయి. అదే సమయంలో ప్రశంసలు కురిసాయి.

ఛాన్స్ ఫిఫ్టీ..ఫిఫ్టీ….

ముఖ్యమంత్రిగా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై లేఖ రాయాలంటే గట్స్ ఉండాలని అనేక మంది అభిప్రాయపడ్డారు. అయితే సీనియారిటీ ప్రకారం చూసుకుంటే జస్టిస్ ఎన్వీ రమణకు చీఫ్ జస్టిస్ గా అవకాశం రావాల్సిందే. కానీ జగన్ లేఖను అడ్డుపెట్టుకుని కేంద్రంలోని పెద్దలు మోకాలడ్డు తారేమోనన్న అనుమానం లేకపోలేదు. జస్టిస్ ఎన్వీ రమణకు ఇంకా పదవీ కాలం 16 నెలలు ఉంది. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయితే వైసీపీకి న్యాయపరంగా మరిన్ని ఇబ్బందులు తప్పవన్న వ్యాఖ్యలు న్యాయవర్గాల నుంచి విన్పిస్తున్నాయి. మరి జస్టిస్ ఎన్వీ రమణ విషయంలో ఏం జరుగుతుందనేది చూడాలి.

Tags:    

Similar News