jyothula : ఎండ్ కార్డు ఆయనే వేసుకున్నారా?

తూర్పు గోదావరి జిల్లాలో సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ. ఆయన మూడు దశాబ్దాలుగా రాజీయాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇక రాజకీయాల నుంచి దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. [more]

Update: 2021-10-29 13:30 GMT

తూర్పు గోదావరి జిల్లాలో సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ. ఆయన మూడు దశాబ్దాలుగా రాజీయాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇక రాజకీయాల నుంచి దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయన తన కుమారుడు నవీన్ కు అప్పగించి ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరమవుతారంటున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా జ్యోతుల నెహ్రూను ఇబ్బంది పెడుతుండటంతో కుటుంబ సభ్యులు కూడా రాజకీయాలకు దూరంగా ఉండాలని వత్తిడి తెస్తున్నారు.

మరోసారి….

జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా తెలిచారు. 1994, 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. తిరిగి 2014లో వైసీపీ నుంచి విజయం సాధించారు. దాదాపు దశాబ్దకాలం పాటు ఆయన ఎమ్మెల్యే పదవికి దూరంగా ఉన్నారు. అయినా జగ్గంపేటలో పట్టుకోల్పేదు. 2014లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి మారిన తర్వాత ఆయన రాజకీయ భవిష‌్యత్ మారిపోయింది. మంత్రిపదవికోసమే పార్టీని మారినా అది మాత్రం దక్కకుండా పోయింది.

రెండూ కలిస్తే….

ఇప్పుడు జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూకు మరింత పట్టు దొరికే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన కలిస్తే వన్ సైడ్ విజయం ఖాయమని ఆయన భావిస్తున్నారు. వైసీపీ నుంచి తిరిగి చంటిబాబు పోటీ చేసే అవకాశాలే ఉన్నాయి. అందుకే ఈసారి తన కుమారుడు జ్యోతుల నవీన్ ను జగ్గంపేట నుంచి బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు. తన సన్నిహితులకు కూడా ఈ విషయాన్ని చెప్పేశారు. నవీన్ అభ్యర్థి అని జగ్గంపేట క్యాడర్ కు పరిచయ కార్యక్రమం కూడా మొదలు పెట్టేశారట.

జిల్లాలో ప్రభావం….

జ్యోతుల నెహ్రూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. ఆయన కాపు సామాజివకర్గం నేత కావడంతో జిల్లాలో ఆయనకు పట్టుంది. ఆయన పోటీ చేయకపోయినా జిల్లాలో ఆయన సేవలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. జ్యోతుల నవీన్ కు జగ్గంపేట టిక్కెట్ ను ఓకే చేసినా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని చంద్రబాబు కోరుతున్నారు. కానీ తాను రాజకీయాలకు దూరంగా ఉండదలచుకున్నట్లు ఆయన చెబుతున్నారు. మొత్తం మీద జ్యోతుల నెహ్రూ రాజకీయం ఇక ముగిసినట్లేనన్నది వాస్తవం.

Tags:    

Similar News