రిస్క్ చేయదలచుకోలేదట… తేల్చుకోవడానికి గులాబీ బాస్ రెడీ ?

ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా నెత్తి ఎలా ఎక్కి తొక్కుతారో ఇటీవల రెండు ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్ కి స్పష్టంగా కనిపించింది. దుబ్బాక, జిహెచ్ఎంసి [more]

Update: 2021-08-26 00:30 GMT

ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా నెత్తి ఎలా ఎక్కి తొక్కుతారో ఇటీవల రెండు ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్ కి స్పష్టంగా కనిపించింది. దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆరెస్ నిర్లిప్తత, నిరాసక్తత కాషాయం ఎదుగుదలకు బాటలు వేసిందన్నది గుర్తించారు కారు పార్టీ అధినేత కేసీఆర్. అలాంటి పరిస్థితి రాకూడదనే ఆ తరువాత జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికల నుంచి వరంగల్ కార్పొరేషన్ వంటి ఎన్నికల పోరులో ఏ మాత్రం అలసత్వం వహించలేదు కేసీఆర్. అదే దూకుడు తో ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికలను గులాబీ బాస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. చతురంగ బలగాలను హుజురాబాద్ కేంద్రంలో కేంద్రీకరించి అక్కడ అభ్యర్థి తానే అనే విధంగానే పోరాటానికి దిగిపోయారు టి సిఎం.

హరీష్, కేటీఆర్, కవితలు ఉన్నా …

వాస్తవానికి హుజురాబాద్ ఎన్నికల బాధ్యతను పార్టీలో సమర్థులైన, నమ్మకస్తులైన సైన్యం కేసీఆర్ కు ఉంది. ట్రబుల్ షూటర్ హరీష్ రావు, తండ్రికి తగ్గ తనయుడు కెటిఆర్, కుమార్తె కవిత ల్లో ఎవరికైనా హుజురాబాద్ ను గెలిపించుకు తీసుకురావాలని టార్గెట్ పెట్టి అప్పగించవచ్చు. కానీ కేసీఆర్ ఏ చిన్న రిస్క్ తీసుకోదలుచుకోలేదు. స్వయంగా తానే సీన్ లోకి దిగిపోయారు. తాను చేయబోయే పోరాటం నిన్న మొన్నటి వరకు తన స్కూల్ లో సుదీర్ఘ కాలం ఉన్న నాయకుడితో కావడంతో ఈ గెలుపు కేసీఆర్ కే కాదు పార్టీకి చాలా అవసరం. ఆ ఎన్నికల్లో ఓటమి కానీ ఎదురైతే భవిష్యత్తులో కేసీఆర్ ఏ నేతను అయినా బహిష్కరిస్తే వారు ప్రత్యర్థి పార్టీలో చేరి మరో ధృడమైన నాయకుడిగా తనను తన పార్టీని సవాల్ చేసే స్థాయికి చేరతారు. ఈటెల రాజేంద్ర అంశాన్ని అందువల్లే కేసీఆర్ చాలా ప్రతిష్ట గా భావించి ఆయన ఓటమిని లక్ష్యంగా పెట్టుకున్నట్లే కనిపిస్తుంది.

విమర్శలకు దారితీసిన ప్రకటన …

మాది సన్నాసుల మఠం కాదు. రాజకీయ పార్టీనే, కనుక తప్పనిసరిగా అడ్వాంటేజ్ తీసుకుంటాం అని నిన్న ఒక సభలో తెలంగాణా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ దళితబంధు ను హుజురాబాద్ లో ప్రకటించడాన్ని సమర్ధించుకున్నారు. దీనిపై రొటీన్ గానే విపక్షాలు కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించే అంశంగా మార్చుకున్నారు. ముఖ్యమంత్రి దిగజారుడికి ఈ వ్యాఖ్యలు అర్ధం పడుతున్నాయంటూ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రతిస్పందించారు. ఇలాంటి తాయిలాలు విసరడం కేసీఆర్ కు కొత్తేమి కాదు. గతంలో ఏ ఎన్నికలు జరుగుతున్నా ఇలాగే ఓటర్లపై బలమైన తాయిలాల వలలు చెప్పి మరి విసరడం గులాబీ బాస్ స్టయిల్. ఈనేపధ్యంలో హుజురాబాద్ లో గులాబీ దళపతి వ్యూహాలు ఎదుర్కొని ఈటల ఎన్నికల పోరాటం చేస్తుండటం ఈ సంగ్రామంలో విజేత ఎవరు అవుతారన్న అంశం నిత్యం హాట్ టాపిక్ అనే చెప్పొచ్చు.

Tags:    

Similar News