తప్పించడం ఖాయమట.. త్వరలోనే ముహూర్తం
అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల కేబినెట్ ను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు [more]
అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల కేబినెట్ ను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు [more]
అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల కేబినెట్ ను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే సామాజికవర్గాల సమీకరణల నేపథ్యంలో కేసీఆర్ అందరికీ అవకాశం కల్పించలేక పోయారు.
రెండోసారి సీఎం అయ్యాక…..
ఇప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ 2019 లో ఒకసారి కేబినెట్ ను విస్తరించారు. ఆ తర్వాత విస్తరణ జరగలేదు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ తన మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశముందని చెబుతున్నారు. కొందరు మంత్రుల పనితీరుపై కేసీఆర్ సంతృప్తికరంగా లేరు. అసంతృప్తి నేతలను కూడా కేసీఆర్ ఈసారి సంతృప్తి పర్చాలనుకుంటున్నారు. జిల్లాల్లో పార్టీలో గ్రూపు విభేదాలు ఎక్కువయ్యాయి.
కొందరిని తప్పించి…
ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రస్తుతమున్న వారిలో కొందరిని మంత్రివర్గం నుంచి తప్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారికి ఇప్పటికే రెండేళ్లు అవకాశమిచ్చానని, మరొకరికి అవకాశం ఇవ్వాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది. ఈ విషయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలిసింది. ముఖ్యంగా ఐదు నుంచి ఆరుగురు మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశమివ్వాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపట్ల కూడా కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు.
ఎమ్మెల్సీలకు అవకాశం…..
వీరిలో కొందరు ఎమ్మెల్సీలుకూడా ఉన్నారంటున్నారు. ప్రధానంగా పనితీరు సరిగా లేని మంత్రులను పక్కన పెట్టి ఎన్నికలకు తన టీంను సిద్ధం చేయాలన్న ఉద్దేశ్యంలో ఉన్న కేసీఆర్ ఈ మేరకు కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశముంది. దీంతో ప్రస్తుతమున్న మంత్రుల్లో కొందరికి అప్పుడే టెన్షన్ పట్టుకుంది.