Kcr : ఆ సర్వే రిపోర్టు అలా వస్తే?

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వేల గురించి చెబుతుంటారు. ఆయనకు ఎన్నికల సమయంలో సర్వేలు చేయించడం అలవాటు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలోనూ మొత్తం [more]

Update: 2021-10-06 11:00 GMT

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వేల గురించి చెబుతుంటారు. ఆయనకు ఎన్నికల సమయంలో సర్వేలు చేయించడం అలవాటు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలోనూ మొత్తం ఐదు సార్లు సర్వే నిర్వహించినట్లు కేసీఆర్ అప్పట్లో చెప్పారు. అభ్యర్థి ఎంపిక నుంచి పోలింగ్ కు ముందు వరకూ సర్వేలు నిర్వహిస్తూ పార్టీ నేతలను అప్రమత్తం చేస్తుంటారు కేసీఆర్. అందుకే ఆయనకు అన్ని ఎన్నికల్లో విజయాలు దక్కుతున్నాయంటారు.

ఇప్పటికే రెండుసార్లు….

ఇప్పుడు తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ కేసీఆర్ రెండు సార్లు ఇప్పటికే సర్వేలు చేయించారట. మరో మూడు సార్లు సర్వేలు ఉంటాయట. తొలుత ఈటల రాజేందర్ బీజేపీ లో చేరిన తర్వాత తొలి సారి సర్వే చేయించారు. ఈ సర్వేలో బీజేపీ కి బలం లేకపోయినా ఈటల వ్యక్తిగత ఇమేజ్ తో కొన్ని సామాజికవర్గాలు ఆయనకు అనుకూలంగా మారే అవకాశముందని తెలిసింది. దీంతోనే దళిత బంధు పథకం తెచ్చారంటారు.

అందుకే ముందుగా….

ఇక అభ్యర్థి ఎంపికపై కూడా కేసీఆర రెండోసారి సర్వే చేయించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు అనేక మంది పోటీ పడ్డారు. అన్ని సామాజికవర్గాల నుంచి నేతలను పేర్లను ఐదుగురిని తీసుకుని నిర్వహించిన సర్వేలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు రావడంతో కేసీఆర్ ఆయన వైపే మొగ్గుచూపారంటున్నారు. అందుకే క్షణం ఆలస్యం చేయకుండా రెండు నెలలకు ముందే అభ్యర్థిని ప్రకటించారు.

బీసీలపై….

ఇప్పుడు తాజాగా మరో సర్వేను కేసీఆర్ చేయిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దళితబంధు పథకం అమలు, బీసీలు ఏ పార్టీవైపు మొగ్గు చూపే అవకాశముంది? వంటి విషయాలపై సర్వే నిర్వహిస్తున్నారు. దళిత బంధు పథకంతో బీసీల్లో అసంతృప్తి నెలకొందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సర్వేను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారంటున్నారు. మొత్తం మీద ప్రతి ఎన్నిక మాదిరిగానే కేసీఆర్ హుజూరాబాద్ లో కూడా సర్వే ఫలితాలను బట్టి కేసీఆర్ ముందడుగు వేయనున్నారు.

Tags:    

Similar News