వారందరికీ ఉద్వాసన తప్పదా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలెగరేసిన వాళ్లను సాగనంపడం ప్రారంభించారు. తొలి సారి గెలిచినప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రుల పట్ల సాఫ్ట్ గా ఉంటే కేసీఆర్ రెండోసారి గెలిచిన తర్వాత [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలెగరేసిన వాళ్లను సాగనంపడం ప్రారంభించారు. తొలి సారి గెలిచినప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రుల పట్ల సాఫ్ట్ గా ఉంటే కేసీఆర్ రెండోసారి గెలిచిన తర్వాత [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలెగరేసిన వాళ్లను సాగనంపడం ప్రారంభించారు. తొలి సారి గెలిచినప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రుల పట్ల సాఫ్ట్ గా ఉంటే కేసీఆర్ రెండోసారి గెలిచిన తర్వాత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. తొలి నుంచి ఉద్యమంలోనూ, పార్టీ నిర్మాణంలోనూ తన వెంట నడిచిన వారిని ఒక్కొక్కరిగా బయటకు పంపుతున్నారు. తన కుమారుడికి లైన్ క్లియర్ చేయడం కోసమే కేసీఆర్ గులాబీ జెండా ఓనర్లమని చెప్పుకుని తిరిగే వారిని దూరం పెడుతున్నారన్న టాక్ వినిపిస్తుంది.
ఇతర పార్టీల నేతలకే?
తొలి దఫా గెలిచినప్పటి నుంచే కేసీఆర్ టీడీపీ, కాంగ్రెస్ లను బలహీనం చేయాలన్న ఉద్దేశ్యంతో ఆ పార్టీల నుంచి నేతలను తీసుకున్నారు. మంత్రి పదవులను ఇచ్చారు. ఇది పార్టీలో కొంత చర్చనీయాంశమైంది. అయినా కేసీఆర్ వెనక్కు తగ్గలేదు. తనకు ఇష్టం లేని నేతలను పక్కన పెడుతూనే వెళుతున్నారు. నాయని నరసింహారెడ్డి దగ్గర నుంచి నిన్న ఈటల రాజేందర్ వరకూ అదే జరిగింది. ఉద్యమంలో తన వెంట నడిచిన వారు తాము కూడా టీఆర్ఎస్ లో భాగస్వామి అంటూ బయట వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణం.
మరో మంత్రిపై కూడా…..?
ఇక మరో మంత్రిపై కూడా త్వరలో వేటు పడుతుందని చెబుతున్నారు. ఆయన కూడా కేసీఆర్ వెంట ఉద్యమ కాల నుంచి నడిచిన వారే. అయితే ఆయన పార్టీ అధినేతపైనా, పార్టీ పైనా చేసిన వ్యాఖ్యలు బయటపడటంతో కేసీఆర్ ఆయనను దూరం పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మంత్రిని కూడా త్వరలో బయటకు పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈటల వ్యవహారం సద్దుమణిగిన తర్వాత మరో మంత్రిపై వేటు పడటం ఖాయమంటున్నారు.
ఈ సారి విస్తరణలో….?
ఆ మంత్రి స్థానంలో అదే జిల్లాకు చెందిన సీినియర్ నేతను తీసుకుంటున్నారని తెలిసింది. ఆయన కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన నేత. మండలిలో కూడా ప్రముఖ స్థానం కల్పించారు. అయితే ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకుని, ఇప్పుడున్న మంత్రిని తొలగించాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది. త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో ఈ మార్పు తప్పకుండా ఉంటుందని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మొత్తం మీద ఉద్యమ కాలం నుంచి తన వెంట నడుస్తున్న వారిని ఒక్కొక్కిరిని కేసీఆర్ తప్పిస్తున్నారన్న టాక్ బలంగా వినపడుతుంది.