వారు మరి కొన్నాళ్లు ఆగాల్సిందే…?

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో జరిగేలా కన్పించడం లేదు. తొలుత శ్రావణ మాసంలో కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని భావించారు. అన్నీ ఎన్నికలు అయిపోవడంతో మంత్రివర్గాన్ని [more]

Update: 2021-08-08 00:30 GMT

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో జరిగేలా కన్పించడం లేదు. తొలుత శ్రావణ మాసంలో కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని భావించారు. అన్నీ ఎన్నికలు అయిపోవడంతో మంత్రివర్గాన్ని విస్తరించి వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేయాలనుకున్నారు. ఎన్నికల కేబినెట్ ను ఈ శ్రావణమాసంలో ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించారు. అయితే ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు లేవు.

అనేక మంది ఆశలు….

ఈటల రాజేందర్ ఎపిసోడ్ లో మంత్రి వర్గ విస్తరణ మరింత వాయిదా పడే అవకాశముంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకూ మంత్రి వర్గ విస్తరణ ఉండదని కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. మంత్రి వర్గ విస్తరణపై అనేకమంది ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీలతో పాటు, పలువురు సీనియర్ నేతలు కూడా ఈసారి విస్తరణలో తమకు అవకాశం దక్కుతుందని ఆశించారు.

ఎప్పటికప్పుడు వాయిదా….

కానీ ఎప్పటికప్పడు ఏదో ఒక ఎన్నిక రావడం వాయిదా పడుతుండటం సాధారణమయింది. గతంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈటల రాజేందర్ వ్యవహారంతో మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ కన్నా హుజూరాబాద్ లో గెలుపు కేసీఆర్ కు అత్యంత ప్రాధాన్యం. అందుకే ఉప ఎన్నికపైనే కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.

వారు ఊపిరి పీల్చుకున్నారుగా?

అయితే మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడుతుండటంతో కొందరు మంత్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ పదవి మరికొద్దినెలలు పదిలం అని భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే నలుగైదుగురిని కేసీఆర్ తప్పించే అవకాశముంది. అనేక ఆరోపణలు వచ్చిన మల్లారెడ్డి వంటి వారిని ఇంకా మంత్రివర్గంలో కొనసాగిస్తుండటంపై విమర్శలు విన్పిస్తున్నాయి. ఇలాంటి వారు మాత్రం మంత్రి వర్గ విస్తరణ వాయిదాతో సంబర పడుతున్నారు. మొత్తం మీద హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నది లేటెస్ట్ అప్ డేట్.

Tags:    

Similar News