Kcr : కేసీఆర్ దొరికిపోతారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కందిరీగ తుట్టెను కెలికినట్లే కన్పిస్తుంది. ఆయనకు వచ్చే ఎన్నికల్లోగా అన్ని సామాజికవర్గాల నుంచి సెగ తగిలే అవకాశముంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కందిరీగ తుట్టెను కెలికినట్లే కన్పిస్తుంది. ఆయనకు వచ్చే ఎన్నికల్లోగా అన్ని సామాజికవర్గాల నుంచి సెగ తగిలే అవకాశముంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కందిరీగ తుట్టెను కెలికినట్లే కన్పిస్తుంది. ఆయనకు వచ్చే ఎన్నికల్లోగా అన్ని సామాజికవర్గాల నుంచి సెగ తగిలే అవకాశముంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి తప్పించుకున్నా సాధారణ ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ దొరికిపోయే అవకాశాలున్నాయి. ఇప్పటికే అన్ని సామాజికవర్గాల నుంచి కొంత డిమాండ్ విన్పిస్తుంది. తెలంగాణలో దళిత బంథు పధకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
దళిత బంధు పేరుతో….
హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే ఈ పథకాన్ని తీసుకువచ్చారన్న విమర్శలు ఉన్నప్పటికీ రాష్ట్రమంతా అమలు చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చారు. ఇందుకు అవసరమైన నిధులను కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తే లక్ష కోట్ల పైమాటే అవుతుంది. ఇందుకోసం తొలి దశలో హుజూరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో నాలుగు మండలాలను ఎంపిక చేశారు.
బీసీ సామాజికవర్గం నుంచి….
ఇప్పుడు బీసీ సామాజికవర్గం నుంచి కూడా తమకు కూడా దళిత బంధు అమలు చేయాలన్న డిమాండ్ విన్పిస్తుంది. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఇప్పటికే ఈ డిమాండ్ చేశారు. ఇక తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. యాభై శాతానికి పైగా జనాభా ఉన్న బీసీలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
రెండేళ్లు మాత్రమే….
ఎన్నికల లోపు బీసీ బంధు అమలు చేయకపోతే ఆ వర్గం కేసీఆర్ కు వ్యతిరేకంగా మారే అవకాశముంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. ఈలోగా కేసీఆర్ ఇటు దళితులకు కూడా పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయలేకపోవచ్చు. అప్పుడు రెండు విధాలుగా కేసీఆర్ కు రాజకీయంగా నష్టం చేకూరే అవకాశముందంటున్నారు. మొత్తం మీద దళిత బంధు పథకంతో ఇతర సామాజికవర్గాలు అధికార పార్టీపై గుర్రుగా ఉన్నాయి. వారిని కూడా కేసీఆర్ ప్రసన్నం చేసుకోవాల్సి ఉంది.