Kcr : ఎంత వ్యతిరేకత ఉంటే అంత మంచిదేగా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని సర్వేలు వెల్లడించాయి. ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్, సీ ఓటర్ సర్వే తెలిపింది. దాదాపు 30.3 శాతం [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని సర్వేలు వెల్లడించాయి. ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్, సీ ఓటర్ సర్వే తెలిపింది. దాదాపు 30.3 శాతం [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని సర్వేలు వెల్లడించాయి. ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్, సీ ఓటర్ సర్వే తెలిపింది. దాదాపు 30.3 శాతం మంది కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్నారని తెలిపింది. దేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్న ముఖ్యమంత్రిగా కూడా ఆ సర్వే తెలిపింది. అయితే కేసీఆర్ పాలనను ఆమోదించే వాళ్లు కూడా అంత కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బలమైన ప్రతిపక్షం….
తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం కేసీఆర్ కు ప్రతి సారీ కలసి వస్తుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఇతర పార్టీల చేతుల్లో పెడితే కుక్కలు చింపిన విస్తరిగా మారుస్తారన్న ఆందోళన కూడా ప్రజల్లో ఉంది. అందుకే రెండుసార్లు కేసీఆర్ కు ప్రజలు అధికారాన్ని అప్పగించారు. రెండోసారి ఎన్నికల్లో తొలిసారి కంటే ఎక్కువ సీట్లు రావడాన్ని కూడా గులాబీ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక మూడోసారి మరింత మెజారిట వస్తుందని చెబుతున్నారు.
ప్రజలకు చేరువై….
తొలి దఫా కంటే రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజలకు మరింత చేరువయ్యారన్నారు. మిషన్ భగీరధ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకూ అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేశారు. అలాగే తిరుమలకు దీటుగా యాదాద్రిని వందల కోట్లను వెచ్చించి పునర్నిర్మాణం చేపట్టారు. ఒక్కసారి ఇప్పుడు యాదాద్రిని చూసిన వారెవ్వరైనా కేసీఆర్ దక్షతను గుర్తుకు తెచ్చుకోక తప్పదు. యాదాద్రి కూడా వచ్చే ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించక మానదన్న ధీమాలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
రెండోసారి….
దీంతో పాటు తొలిసారి కంటే రెండో దఫా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు దళిత బంధు పథకం వంటివి కొత్త పథకాలను తీసుకువచ్చారు. మరో రెండేళ్ల సమయం ఉంది. ఈ సమయంలో ఆయన మరిన్ని పథకాలను ప్రజలకు అందించేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై ఉన్న అసహనం వచ్చే ఎన్నికలలో ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా పడుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ ను ప్రజలు విశ్వసించే అవకాశం లేదు. ఎలా చూసినా, కేసీఆర్ పై ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ మరోసారి విజయం కారు పార్టీదేనన్నది విశ్లేషకుల అంచనా. కొద్దో గొప్పో ఉన్న వ్యతిరేకతను విపక్షాలు చీల్చుకుంటే అది కేసీఆర్ కు అనుకూలమేగా?