‌‌Huzurabad : దసరా తర్వాత సీన్ మార్చేస్తారటగా

హుజూరాబాద్ ఉప ఎన్నికను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దసరా తర్వాత హుజూరాబాద్ లో సీన్ మార్చేస్తామన్న నమ్మకంతో ఉన్నారు. పక్కా వ్యూహంతో వెళుతున్నారు. ప్రతి [more]

Update: 2021-10-09 11:00 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నికను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దసరా తర్వాత హుజూరాబాద్ లో సీన్ మార్చేస్తామన్న నమ్మకంతో ఉన్నారు. పక్కా వ్యూహంతో వెళుతున్నారు. ప్రతి ఓటును, ప్రతి కుటుంబాన్ని కలవాల్సిందేనని కేసీఆర్ ఆదేశాలు వెళ్లాయి. ఇక్కడ గ్రామాల వారీగా నాయకులను నియమించారు. మండలాల వారీగా మంత్రులకు బాధ్యతలను అప్పగించారు. మంత్రులతో నిత్యం కేసీఆర్ కో-ఆర్డినేట్ చేస్తున్నారు.

మంత్రులకే బాధ్యతలు….

ఏ మండలంలో మెజారిటీ తగ్గినా మంత్రులనే కేసీఆర్ ఫిక్స్ చేసినట్లు కనపడుతుంది. ప్రధానంగా ముగ్గురు మంత్రులు ఇందులో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. తన్నీరు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్. కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లు కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులే. హరీశ్ రావు ఓవరాల్ గా నియోజకవర్గం బాధ్యతలను చూసుకుంటున్నారు. ఆయనతో పాటు బోయిన పల్లి వినోద్ కుమార్ కూడా చూస్తున్నారు.

వీరిద్దరూ….

అయితే గంగుల కమలాకర్ కు హుజూరాబాద్ అర్బన్ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. అలాగే కొప్పుల ఈశ్వర్ కు జమ్మికుంట అర్బన్ బాధ్యతలను కేటాయించారు. వీరితో పాటు ఇతర ప్రాంతాల మంత్రులకు బాధ్యతలను మండలాల వారీగా అప్పగించారు. ఈ ఎన్నికల్లో గెలుపు అనేది ముఖ్యమని కేసీఆర్ మొదటి నుంచి నేతలకు నిర్దేశిస్తున్నారు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవాలని కూడా కేసీఆర్ అనేక సార్లు చెప్పారు.

తేడా కొడితే అంతే….

ఈ పరిస్థితుల్లో హుజూరాబాద్ లో తేడా కొడితే మంత్రులను ఫిక్స్ చేసే అవకాశాలే కన్పిస్తున్నాయి. దుబ్బాక మాదిరి కేసీఆర్ హజూరాబాద్ ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోలేదు. ఇక్కడ విజయం వంద శాతం ఉండాలన్న కేసీఆర్ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు మంత్రులు శ్రమిస్తున్నారు. మరి చివరకు ఫలితం సజావుగా వస్తే ఓకే. లేకుంటే హుజూరాబాద్ ఎఫెక్ట్ ముగ్గురి మంత్రులపై పడే అవకాశముంది.

Tags:    

Similar News