Kcr : సౌండ్ కూడా లేకుండా చేశారే?

కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అర్థం కావు. ఆయన పక్కా వ్యూహంతోనే తెలంగాణను సాధించారు. అదే పంధాలో రెండుసార్లు విజయం సాధించారు. తెలంగాణకు తాను తప్ప మరెవ్వరూ దిక్కులేరని [more]

Update: 2021-10-21 09:30 GMT

కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అర్థం కావు. ఆయన పక్కా వ్యూహంతోనే తెలంగాణను సాధించారు. అదే పంధాలో రెండుసార్లు విజయం సాధించారు. తెలంగాణకు తాను తప్ప మరెవ్వరూ దిక్కులేరని చెప్పకనే చెప్పారు. ప్రజలు కూడా ఆయన నాయకత్వాన్నే ఆమోదిస్తూ వస్తున్నారు. ప్రతిపక్షాలకు సౌండ్ చేయకుండా చేయడంలో దిట్ట కేసీఆర్. లోపల వ్యతిరేకించాలని ఉన్నా చేయలేని పరిస్థిితిని ప్రతిపక్షాలకు కల్పించడమే కేసీఆర్ టాలెంట్.

లక్ష కోట్లు….

హుజూరాబాద్ ఉప ఎన్నిక రాగానే దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు. హుజూరబాద్ లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు పరుస్తామని చెప్పారు. రాష్ట్రం మొత్తం అమలు పర్చాలంటే సాధ్యాసాధ్యాలను కూడా తాను పరిశీలించానని కేసీఆర్ చెప్పారు. కేవలం దళిత బంధు పథకం అమలు చేయాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కోట్లు ఖర్చవుతుందని అంచనా. తెలంగాణ మొత్తం మీద 17.5 శాతం మంది దళితులు ఉన్నారని కూడా కేసీఆర్ లెక్కలు చెప్పారు.

విపక్షాల గొంతు….

అసెంబ్లీ లోనే ఎన్ని స్థలాలు విక్రయించైనా తాను దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈ విషయంలో ప్రతిపక్షాలు కనీసం నోరు మెదపలేదు. మిగిలిన బీసీ, ముస్లిం సామాజికవర్గాలకు కూడా ఇదే తరహా పథకాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు తప్ప లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్న ప్రతిపక్షం నుంచి రాలేదు. ప్రతిపక్షం దళిత ఓట్లు కోసం ఆ సాహసం చేయలేకపోయింది.

మాట్లాడే ధైర్యం…?

వచ్చే ఎన్నికలలో గెలవాలంటే ఖచ్చితంగా దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు పర్చాల్సి ఉంటుంది. అంటే లక్ష కోట్ల రూపాయలను ఎన్నికలకు ముందే కేసీఆర్ ఖర్చు పెట్టనున్నారు. మరో పథకాన్ని తెచ్చి మిగిలిన సామాజికవర్గాలకు కూడా నగదు పంపిణీ చేయవచ్చు. కానీ ఆ విషయంలో ప్రతిపక్షాలు ప్రశ్నించలేని పరిస్థితి. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, అప్పులు చేసి, స్థలాలను అయిన కాడికి అమ్మేసి ఈ పథకాలను పెట్టి మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ ను విపక్షాలు ఏమీ అనలేని పరిస్థితి. అలా కేసీఆర్ వారికి సౌండ్ లేకుండా చేశారు.

Tags:    

Similar News