అంతా తానే అయి… తానే ముందుండి?

గ్రేటర్ ఎన్నికల్లో వందకు పైగా సీట్లను సాధిస్తామని మంత్రి కేటీఆర్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో కేటీఆర్ ఉన్నారు. ఇప్పటి [more]

Update: 2020-10-04 00:30 GMT

గ్రేటర్ ఎన్నికల్లో వందకు పైగా సీట్లను సాధిస్తామని మంత్రి కేటీఆర్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో కేటీఆర్ ఉన్నారు. ఇప్పటి నుంచే పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కొద్దినెలల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటి నుంచే అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాలని కేటీఆర్ నిర్ణయించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానే కాకుండా మున్సిపల్ మంత్రి కావడంతో పూర్తి బాధ్యతను తానే తీసుకోనున్నారు.

వార్డుల వారీగా…..

గతంలోనూ కేటీఆర్ గ్రేటర్ ఎన్నికలను ముందుండి నడిపించారు. కేసీఆర్ తాను ప్రచారం చేయనని చెప్పారు. ఈసారి కూడా అలాగే కేటీఆర్ పూర్తి బాధ్యతలను తీసుకున్నారు. వార్డుల వారీగా త్వరలోనే సమీక్షలు చేయాలని నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపికలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది కార్పొరేటర్లు ఉండటంతో గత ఐదేళ్లుగా వారి పనితీరు బేరీజు వేసి టిక్కెట్లు ఖరారు చేయాలని నిర్ణయించారు.

అభివృద్ధి పనులతో….

ప్రతి వార్డులో ఇద్దరు, ముగ్గురు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ప్రమేయంతో టిక్కెట్లు ఇచ్చేది లేదని కేటీఆర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అవినీతి ముద్రపడిన కార్పొరేటర్లకు తిరిగి టిక్కెట్లు ఇచ్చేది లేదని చెప్పారు. ఖచ్చితంగా వంద సీట్లను సాధించే లక్ష్యంతో పనిచేయాలని కేటీఆర్ ఎమ్మెల్యేలకు టార్గెట్ విధించారు. త్వరలోనే గ్రేటర్ హైదరాబద్ లోని ఎమ్మెల్యేలతో కేటీఆర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రానున్న రెండు, మూడు నెలల్లో అభివృద్ధి పనుల జాబితాను తీసుకోనున్నారు. వాటిని పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్లాలన్నది కేటీఆర్ ఆలోచనగా ఉంది.

సోషల్ మీడియా ద్వారా….

ఇక సోషల్ మీడియాలోనూ పార్టీని మరింత యాక్టివ్ చేయాలని కేటీఆర్ భావిస్తున్నారు. పార్టీ సోషల్ మీడియా గ్రూపుతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇటీవల పార్టీ చేయించిన సర్వేలో గతంలో కంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశముందని తేలడంతో సోషల్ మీడియాలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని వార్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఇందుకోసం పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ద్వారా మరింత దూకుడు పెంచాలని కేటీఆర్ నిర్ణయించారు. మొత్తం మీద గ్రేటర్ ఎన్నికల్లో గెలుపోటములకు తాను బాధ్యత వహించి ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. చూద్దాం…. ఏంజరుగుతుందో.

Tags:    

Similar News