లీడర్ కు ఉండాల్సిన లక్షణం ఏదీ లేదట.. అందుకే చంద్రబాబు?

విజ‌య‌న‌గ‌రం జిల్లా గ‌జ‌ప‌తి న‌గ‌రం టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండ‌ప‌ల్లి అప్పల అప్పల‌నాయుడు ఉర‌ఫ్ కేఏ నాయుడు వ్యవ‌హారంపై తీవ్ర చ‌ర్చ సాగుతోంది. ఉట్టికెగ‌ర‌లేన‌మ్మ స్వర్గానికి ఎగురుతాన‌న్న [more]

Update: 2020-05-20 00:30 GMT

విజ‌య‌న‌గ‌రం జిల్లా గ‌జ‌ప‌తి న‌గ‌రం టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండ‌ప‌ల్లి అప్పల అప్పల‌నాయుడు ఉర‌ఫ్ కేఏ నాయుడు వ్యవ‌హారంపై తీవ్ర చ‌ర్చ సాగుతోంది. ఉట్టికెగ‌ర‌లేన‌మ్మ స్వర్గానికి ఎగురుతాన‌న్న చందంగా ఆయ‌న తీరు ఉంద‌ట‌. ఇదే విష‌యం అటు నియోజ‌క‌వ‌ర్గంలోను, ఇటు జిల్లాలోనూ టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున చ‌ర్చించుకుంటున్నారు. దీనికి కార‌ణం.. ఆయ‌న జిల్లా ఇంచార్జ్ ప‌ద‌విని ఆశించ‌డ‌మే. ఇప్పటికే గ‌తంలోనూ ఆయ‌న త‌న‌కు ఈ ప‌ద‌వి ఇవ్వాల‌ని చంద్ర బాబును కోరారు. అయితే.. అప్పట్లోను, ఇప్పుడు కూడా ఆయ‌న ఈ ప‌ద‌వికి స‌రిపోర‌నే వాద‌న పార్టీ సీనియ‌ర్ల నుంచి వినిపిస్తోంది. దీంతో అప్పల‌నాయుడు వ్యవ‌హార శైలిపై ఆస‌క్తికర చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. మాజీ ఎంపీ కొండ‌ప‌ల్లి పైడిత‌ల్లి నాయుడు కుమారుడుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు కేఏ నాయుడు.

కుటుంబంలో విభేదాలు….

2007లో తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత జ‌రిగిన లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో ఓడిన ఆయ‌న 2009లో గ‌జ‌ప‌తిన‌గ‌రం ఎమ్మెల్యేగా కూడా ఓడారు. 2014లో గె‌లిచినా.. కూడా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్రమైన వ్యతిరేక‌త కొని తెచ్చుకున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల నాటికి సొంత సోద‌రుడు టికెట్ కోసం ర‌గ‌డ చేశారు. దీంతో కుటుంబాన్ని చ‌క్కదిద్దుకోలేక పోయారు. పైగా ఆయ‌న కేడ‌ర్‌ను క‌లుపుకొని పోర‌నే టాక్ కూడా ఉంది. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో కార్యక‌ర్తల విష‌యంలోను, పార్టీ విష‌యంలోనూ కూడా ఖ‌ర్చుకు వెనుకాడ‌తార‌నే విమ‌ర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి నియోజ‌క‌వ‌ర్గంలోనే ఆయ‌న‌కు పెద్దగా ప్రభావం చూపే శ‌క్తి లేద‌ని అంటున్నారు.

బొత్స ఇలాకాలో….

అదే స‌మ‌యంలో సోద‌రుడి కార‌ణంగా సొంతింట్లోనే వేరు కుంపటి ఉండ‌డం కూడా ఆయ‌న‌కు పెద్దగా క‌లిసి రావ‌డం లేదు. పోనీ.. కుటుంబ రాజ‌కీయాల‌ను స‌రిదిద్దుకుంటున్నారా ? అంటే అది కూడా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో వైసీపీ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌, ఆయ‌న కుటుంబ స‌భ్యుల ప్రభావం బలంగా ఉన్న నియోజ‌క‌ర‌క‌వ‌ర్గంలో కేఏ నాయుడు దూకుడు ప్రద‌ర్శించినా.. కార్యక‌ర్తలు క‌లిసి వ‌చ్చే అవ‌కాశం లేద‌నే ప్రచారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. పైగా ఇక్కడ బొత్స సోద‌రుడు అప్పల న‌ర‌స‌య్య చాలా బ‌లంగా ఉన్నారు. అప్పల న‌ర‌స‌య్య అంద‌రిని క‌లుపుకుని పోయే గుణం ఉన్న నేత‌గా ఉంటే అప్పల నాయుడు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటార‌న్నది టీడీపీ వ‌ర్గాల అభిప్రాయం. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఇంచార్జ్ అయినా కూడా జిల్లాలో ఏం చ‌క్కదిద్దుతార‌నే ప్ర‌శ్న వ‌స్తోంది.

ఫోన్ చేసిన స్పందించరట…

ఎవ‌రైనా అవ‌స‌ర‌మై.. ఆయ‌న ఫోన్ చేసినా.. స్పందించ‌ర‌నే టాక్ కూడా వినిపిస్తోంది. నేత‌ల‌తోనూ ఆయ‌న‌కు క‌మ్యూనికేష‌న్ ఉండ‌దు. నాయ‌కుడికి ఉండాల్సిన ల‌క్షణాలు ఇవి కావ‌ని ప‌లుమార్లు పార్టీ కీల‌క నేత‌లు హెచ్చరించినా ఆయ‌న మారిన ప‌రిస్థితి లేదు. కానీ, ఆయ‌న దృష్టి మాత్రం జిల్లా స్థాయి రాజ‌కీయాల‌పై ఉంది. ఈ నేప‌థ్యంలో ఇంత పెద్ద ప‌ద‌విని ఆయ‌న‌కు అప్పగిస్తే.. పార్టీ మ‌రింత దెబ్బతింటుంద‌నే భావ‌న వ్యక్తమ‌వుతోంది. ఈ క్రమంలోనే జిల్లా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం నాయుడు బీసీ కార్డు తెర‌పైకి తెస్తున్నార‌న్న టాక్ ఉంది. అయితే జిల్లా నేత‌లు బీసీల‌కే ఈ ప‌ద‌వి ఇవ్వాల్సి వ‌స్తే మ‌రో బీసీ నేత‌కు ఇవ్వాల‌ని కోర‌తారే తప్ప నాయుడుకు ఎంత మాత్రం స‌పోర్ట్ చేయ‌ర‌నే జిల్లా పార్టీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News