మళ్లీ ముదిరాయ్… ముగింపు లేనట్లేనా?

అధికార టీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు మళ్లీ మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఇప్పటి నుంచే ఆధిపత్యం కోసం నేతలు ప్రయత్నిస్తుండటం అధికార టీఆర్ఎస్ కు [more]

Update: 2021-04-07 09:30 GMT

అధికార టీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు మళ్లీ మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఇప్పటి నుంచే ఆధిపత్యం కోసం నేతలు ప్రయత్నిస్తుండటం అధికార టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. స్టేషన్ ఘన్ పూర్ లో టీఆర్ఎస్ అగ్రనేతలు వీధికెక్కడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇద్దరూ ఒకే పార్టీ వారే. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే. అయినా స్టేషన్ ఘన్ పూర్ లో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఇద్దరూ .. ఇద్దరే….

స్టేషన్ ఘన్ పూర్ లో ఇద్దరు నేతలున్నారు. ఒకరు ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. మరొకరు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ఇద్దరికీ గతంలో చెరో పార్టీలో ఉండేవారు. కడియం శ్రీహరి తెలుగుదేశంలో ఉంటే, రాజయ్య కాంగ్రెస్ లో ఉండేవారు. అయితే ఇద్దరూ తెలంగాణ రాష్ట్రం ఉద్యమంతో కేసీఆర్ తో చేతులు కలిపారు. అయితే కేసీఆర్ మాత్రం తాటికొండ రాజయ్యకే స్టేషన్ ఘన్ పూర్ టిక్కెట్ ను కేటాయిస్తూ వస్తున్నారు.

ఆధిపత్యం కోసం….

వరసగా రెండుసార్లు స్టేషన్ ఘనపూర్ నుంచి టీఆర్ఎస్ తరుపున రాజయ్య ఎన్నికయ్యారు. గత ఎన్నికల సమయంలోనే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ టిక్కెట్ ను తన కుమార్తె కోసం ప్రయత్నించారు. అయితే కేసీఆర్ మళ్లీ రాజయ్యకే ఇచ్చారు. కేసీఆర్ మంత్రి వర్గంలో తొలిదఫాలో ఇద్దరూ డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. రాజయ్యపై ఆరోపణలు రావడంతో అప్పట్లో ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని ఎమ్మెల్సీని చేసి మరీ ఉప ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ కట్టబట్టారు.

ఇద్దరీకి ప్రయారిటీ తగ్గించినా…..?

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరీకి ప్రాధాన్యతను కేసీఆర్ తగ్గించారు. అయితే మళ్లీ స్టేషన్ ఘన్ పూర్ పై ఆధిపత్యం కోసం ఇద్దరూ ఒకరిపై ఒకరు బహిరంగంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. స్టేషన్ ఘన్ పూర్ లోపదవులన్నీ తన వర్గానికే రాజయ్య ఇచ్చుకుంటుండటం, అధినాయకత్వం పట్టించుకోక పోవడం కడియం శ్రీహరిని కలవరపరుస్తోంది. దీంతో్నే ఇద్దరి మధ్య మాటల యుద్ధం ప్రారంభమైందని చెబుతున్నారు. మొత్తం మీద స్టేషన్ ఘన్ పూర్ వివాదానికి కేసీఆర్ ఎలా తెరదించుతారో చూడాలి.

Tags:    

Similar News