కాల్వకు ఇలా ప్రయారిటీ ఇస్తుంటే?

తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య రాజకీయాలు ఎక్కువవుతున్నాయి. అధికారంలో లేకపోయినా నేతలు ఎవరూ తగ్గడం లేదు. తమ మాటే చెల్లుబాటు కావాలంటున్నారు. దీంతో పవర్ పాలిటిక్స్ టీడీపీలో ఇప్పటి [more]

Update: 2021-09-21 11:00 GMT

తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య రాజకీయాలు ఎక్కువవుతున్నాయి. అధికారంలో లేకపోయినా నేతలు ఎవరూ తగ్గడం లేదు. తమ మాటే చెల్లుబాటు కావాలంటున్నారు. దీంతో పవర్ పాలిటిక్స్ టీడీపీలో ఇప్పటి నుంచే మొదలయ్యాయి. ఎన్నికలకు ముందే తలెత్తే ఈ విభేదాలు పార్టీకి ఇబ్బందికరంగా మారనున్నాయి. ప్రతి జిల్లాలో ఇదే పరిస్థిితి కన్పిస్తుంది. తాజాగా అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి నేరుగా కాల్వ శ్రీనివాసులు మీద ఆరోపణలు చేయడం విశేషం.

రెండున్నరేళ్లు కావస్తున్నా?

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి రెండేళ్లు కావస్తుంది. ఈ రెండేళ్లలో నేతలు బయటకు వచ్చింది తక్కువే. వరసగా జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతలు హ్యాండ్సప్ అనేశారు. ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రమే జేసీ బ్రదర్స్ దక్కించుకోగలిగారు. అది కూడా తమకున్న పట్టువల్లనేనని వారు బహిరంగంగానే చెప్పారు. వైసీపీలోకి వెళ్లలేని జేసీ బ్రదర్స్ టీడీపీలోనే కొనసాగుతున్నారు.

తాడిపత్రికే పరిమితం….

అనంతపురం జిల్లాలో తమను తాడిపత్రికే పరిమితం చేశారని జేసీ బ్రదర్స్ ఆందోళన చెందుతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి మరోసారి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ నేతలు మాత్రం ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు. జేసీ బ్రదర్స్ ఆధిపత్యాన్ని తాము సహించబోమని కొందరు నేతలు నేరుగా అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు కూడా.

కాల్వ వైపే అందరూ….

అయితే మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు జిల్లా పార్టీని ఒక గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జేసీ బ్రదర్స్ వ్యతిరేకులందరినీ ఆయన దగ్గరకు తీసుకుంటున్నారు. జిల్లాలో ఎక్కువ శాతం మంది టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ ఆధిపత్యాన్ని అంగీకరించడం లేదు. దీంతో చంద్రబాబు కూడా కాల్వ శ్రీనివాసులుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే జేసీ బ్రదర్స్ మాత్రం కాల్వ శ్రీనివాసులను టార్గెట్ చేసినట్లే కనపడుతుంది. అయితే ఈ పంచాయతీలో ఎవరిది పై చేయి అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News