విలక్షణ నటుడికి అన్ని కష్టాలే ….!!!

దేశంలోనే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ రాజకీయ బాట పూల బాట కాదని మూళ్ళ బాటే అని తెలిసి పోయింది. మక్కల్ నీది మయ్యమ్ [more]

Update: 2019-05-17 18:29 GMT

దేశంలోనే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ రాజకీయ బాట పూల బాట కాదని మూళ్ళ బాటే అని తెలిసి పోయింది. మక్కల్ నీది మయ్యమ్ పార్టీతో తమిళనాడులో తన సత్తా చాటాలని తాపత్రయపడుతున్న కమల్ కి ఆదిలోనే చిక్కులు ఎదురవుతున్నాయి. జయలలిత మరణం తరువాత తన లాంటి స్టార్ డం వున్న నేత రంగ ప్రవేశం చేస్తే రాజకీయాలను శాసించవచ్చని ఇప్పుడు ఆ వాక్యూమ్ ఉందని అడుగుపెట్టారు హీరో కమల్. అయితే ఆయన పార్టీ స్థాపించిన నాటినుంచి నేటి వరకు వివాదాలే ఆయన్ను చుట్టుముడుతున్నాయి.

రాళ్ళు , కోడిగుడ్లు , చెప్పులతో …

తమినాడులో ప్రేమ అభిమానాలు, ద్వేషం ఒక రేంజ్ లో వ్యక్తం చేసే స్వభావం అక్కడివారిది. సినిమాల్లో నటించిన సమయంలో పూలవర్షం కురిపించినవారు ఇప్పుడు రాజకీయాల్లో ఏ చిన్న వివాదాస్పద వ్యాఖ్య చేసినా దాడులకు దిగడం కమల్ కి మింగుడు పడటం లేదు. దేశంలో తొలి తీవ్రవాది హిందువేనని మహాత్ముని చంపినా నాధూరాం గాడ్సే కోసం వ్యాఖ్యలు చేస్తూ హిందువులు తీవ్రవాదులనే లా కమల్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు ఒక్క తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా ఆగ్రవేశాలు రగిలించాయి. ఆ మాటలు అన్న తరువాత ఇప్పుడు ఆయన ఉప ఎన్నికలకు ప్రచారానికి వెళ్ళిన చోటల్లా ఎదో ఒక దాడి మొదలైపోతుంది.

ఏదో ఒక వివాదంతో….

ముందు చెప్పులతో ఆయనకు హిందూ మత విశ్వాసకులు దాడి చేస్తే తాజాగా మధురై సమీపంలోని అరవకురిచ్చి లో రాళ్ళు, కోడిగుడ్లు తో మరోసారి దాడికి పాల్పడ్డారు కొందరు. ఈ దాడిలో కమల్ కి స్వల్పంగా గాయాలు అయినట్లు చెబుతున్నారు. అక్కడినుంచి పోలీసుల రక్షణ తో బయటపడ్డ ఆయన ఎన్నికల ప్రచారం తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ఇక నిత్యం ఏదో ఒక వివాదంతో శాంతి భద్రతల సమస్య కమల్ హాసన్ ప్రచారంలో తలెత్తుతున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు కూడా ఆయన సభలకు అనుమతి ఇవ్వాలంటే హడలి పోతున్నారు. తాజా సంఘటనల నేపధ్యాన్ని కమల్ ఇప్పుడు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Tags:    

Similar News