వెన్ను చూపినట్లేనా…?

కమల్ హాసన్ వేసిన తప్పటడుగులు ఆయనను రాజకీయంగా దెబ్బతీశాయనే చెప్పాలి. తమిళనాడులో రాంగ్ టైమ్ లో కమల్ హాసన్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కమల్ [more]

Update: 2019-10-06 17:30 GMT

కమల్ హాసన్ వేసిన తప్పటడుగులు ఆయనను రాజకీయంగా దెబ్బతీశాయనే చెప్పాలి. తమిళనాడులో రాంగ్ టైమ్ లో కమల్ హాసన్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కమల్ హాసన్ పార్టీ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమల్ హాసన్ అభిమానులు, పార్టీ క్యాడర్ కూడా నిరాశలో ఉంది. పోటీ చేయకపోవడానిక కమల్ హాసన్ చెబుతున్న కారణాలు కూడా పెద్దవిగా కన్పించడం లేదు.

ఆర్భాటంగా ప్రారంభించి…..

కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని ఆర్భాటంగా ప్రారంభించారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఆహ్వానించారు. అట్టహాసంగా కమల్ హాసన్ రాజకీయ పార్టీని ప్రారంభించారు. జిల్లాల వారీగా కమల్ హాసన్ పర్యటించి కార్యవర్గాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అన్నాడీఎంకే, డీఎంకేలు నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతుండటంతో కమల్ హాసన్ పార్టీ ప్రభావం చూపుతుందని అందరూ భావించారు.

పోటీ చేసినా…..

కానీ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలు, శాసనసభ ఉప ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ పోటీ చేసింది. ఏ పార్టీతో పొత్తు లేకుండానే ఒంటరిగానే బరిలోకి దిగింది. తొలి నుంచి కమల్ హాసన్ బీజేపీకి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆయన బీజేపీ పై చేసిన ట్వీట్లు కొన్ని సార్లు వివాదాస్పదమయ్యాయి. బీజేపీతో కమల్ హాసన్ కలవరన్నది తొలినాళ్లలోనే స్పష్టమయింది. అయితే డీఎంకే కూటమిలో చేరతారని కమల్ అభిమానులు భావించారు. కానీ ఆయన డీఎంకేతో కూడా కలవడానికి ఇష్టపడలేదు.

ఓటును కొనుగోలు చేస్తున్నారని…..

లోక్ సభ, శాసనసభ ఉప ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. పైగా ఎక్కడా ద్వితీయ స్థానాన్ని కూడా ఆ పార్టీ అభ్యర్థులు లేకపోవడం గమనార్హం. దీంతో ఈ నెలలో జరగనున్న విక్రంవాడి, నాంగునేరి శాసనసభ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోవడం లేదని కమల్ హాసన్ ప్రకటించారు. ఇందుకు ఆయన చెప్పిన కారణం ఓటుకు నోటు సంస్కృతి. ఏ ఎన్నికలు చూసినా ఓట్ల కొనుగోళ్లు సర్వ సాధారణమయింది. మరి ఈ కారణం చూపిన కమల్ హాసన్ ఏ ఎన్నికల్లోనూ ఇక పోటీ చేయరా? 2021 శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే రకంగా వ్యవహరిస్తారా? అన్నది చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News