కమల్ మాత్రం ససేమిరా…సోషల్ మీడియాలో మాత్రం?

కమల్ హాసన్ తొలి నుంచి బీజేపీకి బద్ధ శత్రువు. మోదీ అంటే అస్సలు పడదు. ఏ విషయంలోనైనా ఆయన సూటిగానే చెబుతారు. ఎటువంటి దాపరికాలుండని విలక్షణ నేత [more]

Update: 2020-04-13 18:29 GMT

కమల్ హాసన్ తొలి నుంచి బీజేపీకి బద్ధ శత్రువు. మోదీ అంటే అస్సలు పడదు. ఏ విషయంలోనైనా ఆయన సూటిగానే చెబుతారు. ఎటువంటి దాపరికాలుండని విలక్షణ నేత కమల్ హాసన్. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తూ వేలాది మందిని పొట్టన పెట్టుకుంటుంటే కమల్ హాసన్ మాత్రం మోదీ ఫెయిలయ్యారని చెప్పేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారత్ తీసుకుంటున్న చర్యలపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నా కమల్ హాసన్ మాత్రం మోదీ ఫెయిలయ్యారంటున్నారు.

నోట్ల రద్దు తరహాలోనే…..

నోట్ల రద్దు తరహాలోనే లాక్ డౌన్ ను ఉన్నట్లుండి మోదీ ప్రకటించారన్నది కమల్ హాసన్ ఆరోపణ. నోట్ల రద్దును ఎవరైనా అలా చేయాల్సిందే. ముందు చెప్పి నోట్లను రద్దు చేయరు. బ్లాక్ మనీని బయటకు తీసుకురావడానికి నోట్ల రద్దు కార్యక్రమాన్ని మోదీ చేపట్టారు. అది సఫలమా? విఫలమా? అన్నది పక్కన పెడితే కొన్ని రోజులు ప్రజలు ఇబ్బంది పడింది వాస్తవమే అయినా ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకుంది.

లాక్ డౌన్ విషయంలో….

ఇక లాక్ డౌన్ విషయంలోనూ అంతే. లాక్ డౌన్ విషయంలో మీనమేషాలు లెక్కించి అగ్రరాజ్యం అమెరికా ఎంత నష్టపోయిందీ చూశాం. ఇటీలీ శ్మశానగుట్టగా మారిందీ విన్నాం. సింగపూర్ లాక్ డౌన్ ఎత్తి వేసి మళ్లీ విధించిన వార్తలను కూడా మనం వింటున్నాం. లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు పర్చడం వల్లనే భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఎక్కువగా లేదని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు సయితం అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది.

కమల్ పై మండి పడుతున్న……

కానీ కమల్ హాసన్ కు మాత్రం మోదీ తీసుకున్న నిర్ణయాల్లో తప్పులే కన్పిస్తున్నాయి. ఎవరి అభిప్రాయాలు వారివే అయినా విపత్తు సమయంలో కమల్ హాసన్ సొంత రాష్ట్రమైన తమిళనాడులోనే కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. 600కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం రాజకీయాల కోసమే కమల్ హాసన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారని సోషల్ మీడియాలో నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. మొత్తం మీద ఊరందరిదీ ఒక దారైతే కమల్ హాసన్ ది మాత్రం మరో దారి అన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News