కసి మీదే ఉన్నారు కానీ?
కమల్ హాసన్ ఈసారి కసిమీద ఉన్నట్లే కన్పిస్తుంది. తమిళనాడు ఎన్నికల్లో సత్తా చాటాలని కమల్ హాసన్ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలను రచించుకుంటున్నారు. ముందుగానే అభ్యర్థుల ఎంపిక, [more]
కమల్ హాసన్ ఈసారి కసిమీద ఉన్నట్లే కన్పిస్తుంది. తమిళనాడు ఎన్నికల్లో సత్తా చాటాలని కమల్ హాసన్ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలను రచించుకుంటున్నారు. ముందుగానే అభ్యర్థుల ఎంపిక, [more]
కమల్ హాసన్ ఈసారి కసిమీద ఉన్నట్లే కన్పిస్తుంది. తమిళనాడు ఎన్నికల్లో సత్తా చాటాలని కమల్ హాసన్ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలను రచించుకుంటున్నారు. ముందుగానే అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నారు. తమిళనాడులో ఎన్నికలకు ఇంకా నెలల సమయమే ఉంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యమ్ కూడా ప్రజల చెంతకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది.
కూటమి కట్టాలనుకున్నా….
కమల్ హాసన్ పొత్తు కోసం ఎదురు చూశారు. డీఎంకే, అన్నాడీఎంకే లక ప్రత్యామ్నాయంగా కూటమి కట్టాలని భావించారు. అయితే ఇప్పటి వరకూ దానిపై ముందు అడుగు పడకపోవడంతో తన పని తాను చేసుకు పోవడమే బెటరని కమల్ హాసన్ భావించారు. అందుకోసం అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని కూడా కమల్ హాసన్ ప్రారంభించారని తెలుస్తోంది. జిల్లా కార్యదర్శులకు ఈ పనిని పురమాయించారు.
అభ్యర్థుల ఎంపిక…..
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కార్యదర్శులతో మాట్లాడుతున్న కమల్ హాసన్ వారికి దిశానిర్దేశం చేస్తున్నాు. నిజాయితీ, సేవాభావంతో పాటు ఎన్నికలను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను కూడా అభ్యర్థుల ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలని కమల్ హాసన్ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. నియోజకవర్గానికి ముగ్గురు నుంచి నలుగురి నేతల పేర్లను తనకు సూచించాలని కమల్ హాసన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ప్రచారం కూడా……
దీంతో పాటు తన ప్రచారానికి తగిన ఏర్పాట్లు కూడా చేయాలని జిల్లా కార్యదర్శులను కోరారు. తొలుత కమల్ హాసన్ రాష్ట్రమంతటా బస్సు యాత్ర చేేయాలని భావించారు. కానీ కరోనా నేపథ్యంలో ఆలోచనను విరమించుకున్నారు. వర్చువల్ మీటింగ్ లద్వారానే ప్రచారం నిర్వహించాలని కమల్ హాసన్ భావిస్తున్నారు. దీంతో పాటు జిల్లాల పర్యటనలను కూడా చేపడతానని కమల్ హాసన్ వారికి చెప్పారు. దీంతో త్వరలోనే కమల్ హాసన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. పొత్తులు తర్వాత ఖరారవుతాయని, ముందుగా ప్రచారం ప్రారంభించాలన్న ఉద్దేశ్యంలో ఉన్నారు.