కమల్ కమాల్ చేస్తారా…?

తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఇన్ ఛార్జులను నియమించిన [more]

Update: 2020-09-09 17:30 GMT

తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఇన్ ఛార్జులను నియమించిన కమల్ హాసన్ ప్రతి నియోజకవర్గం నాయకత్వంపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలకే టిక్కెట్లు ఇవ్వాలని కమల్ హాసన్ నిర్ణయించుకున్నారు. దీంతో పాటు తమకు పట్టు ఉన్న నియోజకవర్గాలపై కూడా కమల్ హాసన్ ఒక అవగాహనకు వస్తున్నారు.

ఒంటరిగా పోటీ చేసేందుకు….

కమల్ హాసన్ ఒంటరిగా పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు. మరోవైపు ఇటు డీఎంకే, అటు అన్నాడీఎంకేలకు సమాన దూరం పాటించాలని కమల్ హాసన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కమల్ హాసన్ కాంగ్రెస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ తనతో కలసి రాకుంటే మరికొన్ని పార్టీలను కలుపుకుని వెళ్లాలని కమల్ హాసన్ నిర్ణయించారు. డీఎండీకే విజయకాంత్ పార్టీని కూడా తనతో కలుపుకుని వెళ్లాలన్నది కమల్ హాసన్ ఆలోచనగా ఉంది.

రజనీతో జత కట్టాలని….

మరోవైపు రజనీకాంత్ పార్టీ ప్రకటిస్తే దానితో కలిసి పోటీ చేసేందుకు కూడా కమల్ హాసన్ సిద్ధమయ్యారు. రజనీకాంత్ ఎప్పుడు పార్టీ ప్రకటించినా ఆయనను స్వయంగా కలసి పొత్తు అంశాలపై తమ పార్టీ అధినేత చర్చిస్తారని మక్కల్ నీది మయ్యమ్ అధికార ప్రతినిధి చెబుతుండటం విశేషం. అంటే రజనీకాంత్ పార్టీపైనే ఎక్కువగా కమల్ హాసన్ ఆశలు పెట్టుకున్నారన్న మాట. అయితే రజనీకాంత్ పార్టీ ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయకుండా ముందుగానే పార్టీ శ్రేణులను కమల్ హాసన్ సిద్ధం చేస్తున్నారు.

తాను పోటీ చేసేందుకు……

దీంతో పాటు కమల్ హాసన్ స్వయంగా తాను అసెంబ్లీ బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ప్రధానంగా ప్రముఖలు పోటీ చేసే స్థానాల నుంచి పోటీ చేయాలన్నది కమల్ హాసన్ ఆలోచనగా ఉంది. చెన్నైలోని థౌంజెడ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న యోచనలో ఉన్నారు. ఇక్కడి నుంచి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి పోటీ చేసే అవకాశాలున్నాయి. దీంతో పాటు తాను నివాసముంటున్న మైలాపూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న యోచనలో కూడా ఉన్నారు. మొత్తం మీద కమల్ హాసన్ సీరియస్ గానే ఎన్నిలక బరిలోకి దిగుతున్నారు.

Tags:    

Similar News