అంతా కమల్ వైపు చూస్తున్నారా?

తమిళనాడు ఎన్నికలకు ఇంకా మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. అన్ని పార్టీలూ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈసారి తమిళనాడులో ఎవరిది గెలుపు అన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతమున్న [more]

Update: 2021-01-21 18:29 GMT

తమిళనాడు ఎన్నికలకు ఇంకా మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. అన్ని పార్టీలూ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈసారి తమిళనాడులో ఎవరిది గెలుపు అన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడినా ఆశ్చర్యం లేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కమల్ హాసన్ కు చెందిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీ కారణమవుతుందంటున్నారు. కమల్ హాసన్ కింగ్ మేకర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

పార్టీ గెలవలేకపోయినా….

కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించి రెండేళ్లు అవుతుంది. ఆయన వివిధ ఎన్నికల్లో పోటీ చేసినా పెద్దగా ఫలితాలు రాలేదు. దీంతో కమల్ హాసన్ పార్టీపై అంచనాలు పోయాయి. ఆయనకు ఏ వర్గమూ అండగా లేదని, ఆయన అభిమానులు తప్పించి కమల్ హాసన్ వైపు ఎవరూ చూడలేదని ఆ ఎన్నికల సందర్భంగా రాజకీయ విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ఆ ఎన్నికలు వేరు. సాధారణ ఎన్నికలు వేరంటున్నారు.

రజనీ ఎఫెక్ట్…..

ప్రధానంగా రజనీకాంత్ ఎఫెక్ట్ ఈ ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రజనీకాంత్ పార్టీ పెట్టకపోయినా, ఆయన ఎవరికీ మద్దతు ప్రకటించకపోయినా ఆయనను అభిమానించే వారంతా కమల్ హాసన్ వైపు చూసే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. కమల్ హాసన్, రజనీకాంత్ మంచి స్నేహితులు కావడంతో పాటు తొలి నుంచి రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని కమల్ హాసన్ స్వాగతించారు.

తటస్థ ఓటర్లు….

దీంతో పాటు రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడానికి బీజేపీ కూడా కారణమన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే ల పట్ల విసిగిపోయిన తటస్థ ఓటర్లు కమల్ హాసన్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు. రజనీకాంత్ అభిమానులు సయితం కమల్ హాసన్ కే జైకొట్టే అవకాశాలున్నాయి. దీంతో కమల్ హాసన్ ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు.

Tags:    

Similar News