కమల్ పవన్ లా కాదు…? సేఫ్ ప్లేస్ ను ఎంచుకున్నారు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన రెండుచోట్ల ఓటమి పాలయి ఘోరంగా [more]

Update: 2021-03-25 18:29 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన రెండుచోట్ల ఓటమి పాలయి ఘోరంగా అవమానానికి గురయ్యారు. ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లోనూ కమ్ హాసన్ ను పవన్ కల్యాణ్ తో పోల్చి చూస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాదిరి కమల్ హాసన్ రెండు స్థానాల్లో పోటీ చేయడం లేదు. కేవలం ఒక్క స్థానంలోనే బరిలోకి దిగుతున్నారు.

పార్టీ స్థాపించిన తర్వాత…..

కమల్ హాసన్ తమిళనాట మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించి దాదాపు మూడేళ్లు కావస్తుంది. అయితే ఉప ఎన్నికల్లో ఏ మాత్రం కమల్ హాసన్ పార్టీ ప్రభావం చూపించలేదు. అయితే సాధారణ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు కమల్ హాసన్ సిద్ధమవుతున్నారు. అన్నాడీఎంకే, డీఎంకే కూటమికి ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమిని ఏర్పాటు చేశారు. మిత్ర పక్షాలతో కలసి 234 స్థానాల్లో బరిలోకి దిగుతున్నారు.

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో…..

కానీ తొలిసారి కమల్ హాసన్ ప్రత్యక్ష ఎన్నికల్లో దిగుతున్నారు. కమల్ హాసన్ తన ఇమేజ్ తో ఎక్కడైనా గెలిచే అవకాశముంది. అయితే కమల్ హాసన్ తెలివిగా ఈ ఎన్నికల్లో కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని డిసైడ్ అయ్యారు. అన్నింటికీ అనుకూలంగా ఉండే ఈ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని కమల్ హాసన్ భావిస్తున్నారు. కమల్ హాసన్ తమ పార్టీ అభ్యర్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పరచారం చేయాల్సి ఉంటుంది. ఒక్క తన నియోజకవర్గానికే పరిమితమయ్యే అవకాశం లేదు.

సేఫ్ అని భావించి…..

అందుకే కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గాన్ని కమల్ హాసన్ ఎంచుకున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 2016 ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి అమ్మన్ కే అర్జున్ విజయం సాధించారు. అయితే ఈసారి ఈస్థానాన్ని పొత్తులో భాగంగా అన్నాడీఎంకే బీజేపీకి కేటాయించింది. దీంతో అన్నాడీఎంకే క్యాడర్ లో అసంతృప్తి ఉంది. ఇది కమల్ హాసన్ కు అనుకూలించే అంశం. మొన్న పార్లమెంటు ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ కు 11 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో కమల్ హాసన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే తన విజయానికి ఢోకా ఉండదని భావించి బరిలోకి దిగుతున్నారు.

Tags:    

Similar News