జగన్ పై దూకుడు అందుకేనా…?
బీజేపీ ఏపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ చుట్టూ ఇప్పుడు రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో [more]
బీజేపీ ఏపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ చుట్టూ ఇప్పుడు రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో [more]
బీజేపీ ఏపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ చుట్టూ ఇప్పుడు రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటంటే ఒక్కటి కూడా దక్కించుకోలేక పోయిన బీజేపీ.. 2014 నాటి గౌరవాన్ని కూడా ఏపీలో దక్కించుకోలేక పోయింది. అదే సమయంలో ఓటు బ్యాంకును కూడా కాపాడుకోలేక పోయింది. ఇటు ఏపీ ప్రజల్లోనూ ఆ పార్టీ అంటే తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. మరి ఇలా ఉన్న పార్టీ ఎలా ఉండాలి. కాంగ్రెస్ ఎలా ఉందో అలానే ఉండాలి! అనే సమాధానం వస్తుంది. అయితే, దీనికి భిన్నంగా రాష్ట్రంలోని బీజేపీ నాయకులు రెచ్చిపోతున్నారు.
ఎందుకంతగా…?
ముఖ్యంగా పార్టీ రాష్ట్ర సారధి.. కన్నా లక్ష్మీనారాయణ అయితే, చాలా దూకుడుగా వెళ్తున్నారు. ముఖ్యంగా జగన్‌ను విమర్శిస్తున్న తీరు కన్నా లక్ష్మీనారాయణనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడా ? అనే రేంజ్‌లో ఉంది. అదే సమయంలో తామే జగన్‌కు అసలు సిసలు ప్రతిపక్షం అంటూ కూడా ఆయన తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఇలా కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు రెచ్చిపోతున్నారు? అసలు దీని వెనుక ఉన్న కిటుకు ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం వెతికితే.. చాలా విషయమే కనిపిస్తున్నది. రాష్ట్రంలో బీజేపీ ఘోరాతి ఘోరంగా ఓటమి పాలైంది.
కొత్త నేతలు తెరపైకి….
తమ వల్లే 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని చెప్పుకొన్న నాయకులు ఏ ఒక్కరినీ గెలిపించుకోలేక పోయారు. ముఖ్యంగా పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ.. కాంపిటీషన్ బాగానే ఉన్నప్పటికీ.. ఏరికోరి అమిత్ షా.. కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష పగ్గాలు అప్పగించారు. కన్నా లక్ష్మీనారాయణ ఛార్జ్ తీసుకున్న తర్వాత.. రాష్ట్రంలో బీజేపీ నానాటికీ తీసికట్టు నాగం బొట్టు.. అన్నట్టుగా మారిపో యింది. ఎన్నికల్లో ఒక్కరికి కూడా గౌరవ ప్రదమైన స్థానం కల్పించలేకపోయారు. అంతర్గతంగా ఉన్న విభేదాలను కూడా అరికట్టలేక పోయారు. దీంతో ఇప్పుడు కొత్త నేతలు తెరమీదికి వస్తున్నారు.
విఫలమయ్యారని…..
ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన సుజనా చౌదరి వేగంగా స్పందిస్తున్నారు. ఇక, సోము వీర్రాజు వంటివారు ఎప్పుడెప్పుడు అధ్యక్ష పీఠంపై కూర్చుందామా? అనే ఆలోచనలోనే ఉన్నారు. అదే సమయంలో పురందేశ్వరి వంటివారు కేంద్రంలో చక్రం తిప్పుతూ. రాష్ట్రంలోనో కేంద్రంలోనో పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు రాష్ట్ర అధ్యక్షుడి.. విఫలమైన రాజకీయాలను ఎక్కడ ఏకరువు పెడతారోనని కన్నా లక్ష్మీనారాయణ అదిరిపోతున్నారు. ఈ క్రమంలోనే కనీసం ఆరోపణలైనా చేద్దామని, తన మిత్రుడి(వైఎస్) కుమారుడే అయినా జగన్‌పై వ్యాఖ్యలు సంధిస్తున్నారు. వాస్తావనికి ఈయన బీజేపీలోకి రాకపోయి ఉంటే .. వైసీపీలో చేరేవారేనన్న విషయం తెలిసిందే.