కన్నాను అలా వాడేశారు

బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ కథ ముగిసినట్లే కన్పిస్తుంది. ఆయన స్థానంలో కొత్త నేతను నియమించే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ కు [more]

Update: 2020-02-22 09:30 GMT

బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ కథ ముగిసినట్లే కన్పిస్తుంది. ఆయన స్థానంలో కొత్త నేతను నియమించే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ కు కొత్త అధ్యక్షులు వస్తారని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. కన్నా లక్ష్మీనారాయణను తప్పించి మరొక నేతకు అవకాశం ఇచ్చే ఆలోచనలో కేంద్ర నాయకత్వం ఉంది. కన్నా లక్ష్మీనారాయణ పదవీ కాలం కూడా రెండేళ్లు పూర్తి కావడంతో ఆయనను తప్పించడం ఖాయమన్న వార్తలు వెలువడుతున్నాయి.

ఎన్నికలకు ముందు……

కన్నా లక్ష్మీనారాయణ 2019 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. నిజానికి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. జగన్ తో అపాయింట్ మెంట్ కూడా ఫిక్సయింది. అయితే నేరుగా అమిత్ షా ఫోన్ చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్య పదవి ఆఫర్ ఇవ్వడంతో కన్నా లక్ష్మీనారాయణ వైసీీపీలో చేరే ఆలోచనను విరమించుకున్నారు. గత ఎన్నికల్లోనూ కన్నా లక్ష్మీనారాయణ సారథ్యంలో నోటా కంటే పార్టీకి ఓట్లు తక్కువరావడం కూడా పార్టీ అధిష్టానాన్ని ఆలోచనలో పడేసింది.

సామాజికవర్గం నేపథ్యంలోనే…..

కన్నా లక్ష్మీనారాయణ ఏపీలో బలమైన కాపు సామాజికవర్గం నేత. ఏపీలో ఆ సామాజికవర్గం ఓటు బ్యాంకు ఎక్కువ ఉండటంతో ఎన్నికలకు ముందు ఆయనను పార్టీ అధ్యక్షుడిగా పార్టీ చేసింది. అయితే ఇప్పుడు జనసేనతో పొత్తుతో కన్నా లక్ష్మీనారాయణ ఆ సామాజికవర్గంలో సెకండరీ అయ్యారు. పవన్ వంటి బలమైన నేతతో పొత్తు కుదరడంతో కన్నా లక్ష్మీనారాయణను పక్కన పెట్టాల్సిన అవసరం పార్టీకి కూడా ఏర్పడింది.

చిన్నమ్మకే ఛాన్స్……

అయితే కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో ఎవరిని నియమిస్తారన్న చర్చ జరుగుతోంది. వీరిలో ప్రముఖంగా పురంద్రీశ్వరి, సోము వీర్రాజు, పీవీఎస్ మాధవ్, మాణిక్యాలరావు పేర్లు విన్పిస్తున్నాయి. వీరిలో మాధవ్, పురంద్రీశ్వరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. పురంద్రీశ్వరికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ప్రచారం ఉంది. ఏపీలో కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది అధిష్టానం ఆలోచనగా ఉంది. మొత్తం మీద కన్నా లక్ష్మీనారాయణను ఈ రెండేళ్ల కాలం ఇలా వాడేసుకున్నారన్న వ్యాఖ్యలు ఆయన వర్గం నుంచి విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News