ఇద్దరూ వ్యతిరేకమేనా…?
ఆ ఇద్దరూ అందుకే సైలెంట్ గా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కసి ఇప్పుడు తీర్చుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాడి [more]
ఆ ఇద్దరూ అందుకే సైలెంట్ గా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కసి ఇప్పుడు తీర్చుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాడి [more]
ఆ ఇద్దరూ అందుకే సైలెంట్ గా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కసి ఇప్పుడు తీర్చుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో 23 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గెలిస్తే అందులో నలుగురు మినహా ఎవరూ గొంతు విప్పడం లేదు. చంద్రబాబునాయుడుపై అధికార పక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతున్నా వారిద్దరికీ చీమకుట్టినట్లయినా లేదు. వారే కరణం బలరామకృష్ణమూర్తి, పయ్యావుల కేశవ్.
బాబుకు సాయంగా….
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార పక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబునాయుడును టార్గెట్ చేసుకుంది. ప్రతి అంశంలోనూ ఆయనపై వ్యక్తిగత దాడికి దిగుతుంది. దీనికి చంద్రబాబునాయుడు స్వయంగా కౌంటర్ ఇవ్వాల్సి వస్తోంది. అచ్చెన్నాయుడు, రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మినహా మిగిలిన వారు నోరు మెదపడం లేదు. ఇందులో చంద్రబాబునాయుడు సామాజిక వర్గానికి చెందిన కరణం బలరామకృష్ణమూర్తి, పయ్యావుల కేశవ్ పైనే పార్టీలో చర్చ జరుగుతుంది.
మంత్రి పదవి దక్కలేదనేనా?
ఇందుకు కారణాలు ఉన్నాయంటున్నారు. పయ్యావుల కేశవ్ ఎప్పుడు గెలిచినా పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. దీంతో ఆయనకు ఎప్పుడూ మంత్రి పదవి దక్కేలేదు. 2014లో ఎమ్మెల్సీ గా ఉన్న పయ్యావుల కేశవ్ కు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు. సబ్జెక్ట్ పరంగా, వాగ్దాటిగా మాట్లాడతారన్న పేరు పయ్యావుల కేశవ్ కు ఉంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సయమంలోనూ పయ్యావుల కేశవ్ టీడీపీ గొంతుకగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ పయ్యావుల విమర్శలకు అధికార పక్షం కూడా దడదడ లాడేది. అయితే ఈ శాసనసభ సమావేశాల్లో పయ్యావుల పెదవి విప్పక పోవడానికి కారణం తనకు చంద్రబాబునాయుడు మంత్రి పదవి ఇవ్వలేదన్న అక్కసు కనపడుతుందన్నది పార్టీ వర్గాల టాక్.
ఆయన్ను చేర్చుకున్నారనేనా?
ఇక మరో సీనియర్ నేత కరణం బలరామకృష‌్ణమూర్తి కూడా అంతే. ఆయనకు కూడా చంద్రబాబునాయుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదు. కరణం బలరాంకు ప్రధాన శత్రువైన గొట్టిపాటి రవికుమార్ ను తనను కాదని పార్టీలో చేర్చుకున్నారన్న ఆగ్రహం కూడా ఉందంటున్నారు. దీంతో ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. దీంతో చంద్రబాబునాయుడుకు అండగా ఉండాల్సిన ఈ ఇద్దరు నేతలపై ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. మొత్తం మీద చంద్రబాబునాయుడు సొంత సామాజిక వర్గం నేతల నుంచే అసంతృప్తిని ఎదుర్కొంటుండం విశేషం.