వైసీపీలో పెత్తనం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే.. రెండు చోట్ల హవా..!
ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్‌గానే సాగుతుంటాయి. ఏదో ఒక విషయంతో ఎప్పుడూ ప్రధాన వార్తా స్రవంతిలో ఉంటూనే ఉంటాయి. ఇలానే ఇప్పుడు.. కూడా మరో [more]
ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్‌గానే సాగుతుంటాయి. ఏదో ఒక విషయంతో ఎప్పుడూ ప్రధాన వార్తా స్రవంతిలో ఉంటూనే ఉంటాయి. ఇలానే ఇప్పుడు.. కూడా మరో [more]
ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్‌గానే సాగుతుంటాయి. ఏదో ఒక విషయంతో ఎప్పుడూ ప్రధాన వార్తా స్రవంతిలో ఉంటూనే ఉంటాయి. ఇలానే ఇప్పుడు.. కూడా మరో కీలక విషయంతో జిల్లా రాజకీయాలు చర్చకు వస్తున్నాయి. చీరాల నియోజకవర్గంలో టీడీపీ తరఫున విజయం సాధించిన సీనియర్ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి వ్యవహారం ఇప్పుడు చర్చకు వస్తోంది. ఈయన టీడీపీ తరఫున చీరాల నుంచి పోటీ చేసి, వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్‌పై విజయం సాధించారు. నిజానికి రాష్ట్రం మొత్తం టీడీపీ తుడిచి పెట్టుకుపోయినా.. ప్రకాశం, విశాఖ జిల్లాల్లో మాత్రం పరువు నిలబడేలా నాలుగు నాలుగు స్థానాలు దక్కాయి.
టెక్నికల్ గా టీడీపీలో ఉన్నా…..
ఇలా కరణం బలరాం అనూహ్య విజయం సాధించారు. అయితే, ఆయన ఇటీవల తన కుమారుడు కరణం వెంక టేష్ ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకుని.. టీడీపీకి దూరమయ్యారు. వైసీపీకి మద్దతు పలికారు. టెక్నికల్‌గా ఆ యన టీడీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ.. నైతికంగా మాత్రం వైసీపీకి కరణం బలరాం మద్దతిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఆయన హవా పూర్తిగా చలామణి అవుతోంది. ఇటీవల స్థానిక ఎన్నికల్లోనూ ఆయన తన వారికి టికెట్లు ఇప్పించుకున్నారు. ఇలా.. ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడే అయినప్పటికీ.. అధికార పార్టీ నుంచి అన్నీ చేయించుకుంటున్నారు. ఇక పైకి చెప్పుకోకపోయినా ఆమంచి కూడా కరణం బలరాం రాకతో రగిలి పోతోన్న పరిస్థితి.
సొంత నియోజకవర్గంలో…
ఇక కరణం బలరాం సొంత నియోజకవర్గం అద్దంకి. ఇక్కడ నుంచి తన కుమారుడికి అవకాశం ఇప్పించుకునేందుకు ప్రయత్నించిన కరణం బలరాంకి గొట్టిపాటి రవి కారణంగా వెనక్కి తగ్గక తప్పలేదు. దీంతో ఆయన చీరాలకు మారారు. అయినప్పటికీ సొంత నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాస్తవానికి అద్దంకిలో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిన బాచిన చెంచు గరటయ్య ఉన్నారు. అయితే, ఆయన వయోవృద్ధుడు కావడంతో తన కుమారుడు ని ఇక్కడ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. జగన్ సైతం కొద్ది నెలల క్రితమే గరటయ్య కుమారుడు బాచిన కృష్ణ చైతన్యకు అద్దంకి వైసీపీ పగ్గాలు అప్పగించారు.
కుమారుడికి ఇప్పించుకోవాలని….
అయితే, తాజాగా వైసీపీ మద్దతు దారుగామారిన కరణం బలరాం మాత్రం తన కుమారుడికి ఇక్కడ వైసీపీ పగ్గాలు అందించాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. దీంతో అద్దంకిలో దాదాపు వైసీపీ ఇంచార్జ్‌గా కూడా కరణం అనధికారికంగా చక్రం తిప్పుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు గెలిచింది టీడీపీలో అయినా.. అటు అధికార పార్టీలోను, ఇటు విపక్షంలోనూ చక్రం తిప్పుతున్నారని చర్చించుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో మంత్రులు అయినా, ఎమ్మెల్యేలు అయినా పక్క నియోజకవర్గంలో పెత్తనం చేసే ఛాన్సే లేదు. జగన్ చేయనీయడం లేదు.. అయితే కరణం బలరాం మాత్రం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి ఏకంగా రెండు నియోజకవర్గాల్లో పెత్తనం చేస్తున్నారని వైసీపీ వాళ్లు సైతం కాస్త రుసరుసలాడుతున్నారు.