కరణం కాటుకు బలయిపోవాల్సిందేనా?

రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారివి. ఎవరి ఎత్తులు వారివి. కానీ భవిష్యత్తును ఊహించి ఏపార్టీ అయినా నియోజకవర్గంలో నాయకత్వాన్ని నియమించాలి. కానీ చీరాల తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ [more]

Update: 2020-08-26 13:30 GMT

రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారివి. ఎవరి ఎత్తులు వారివి. కానీ భవిష్యత్తును ఊహించి ఏపార్టీ అయినా నియోజకవర్గంలో నాయకత్వాన్ని నియమించాలి. కానీ చీరాల తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ కరణం బలరాం మాటే చెల్లుబాటు అవుతుండటం చర్చనీయాంశమైంది. కరణం బలరాం పార్టీని వీడి వైసీపీలో చేరినా పార్టీ ఆయన చెప్పినట్లే నియోజకవర్గంలో నడుస్తుండటంతో తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. చీరాలలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి నెలకొంది.

బలంగా ఉండే టీడీపీ…..

చీరాల నియోజకవర్గంలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ బలంగా ఉండేది. 1983 నుంచి మొన్నటి ఎన్నికల వరకూ 9సార్లు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఐదు సార్లు గెలిచింది. టీడీపీ చీరాల నియోజకవర్గంలో ఎంత బలంగా ఉందో ఇట్టే చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరిపోయారు. ఆయన ఎన్నికలకు ముందు వైసీపీలో చేరడంతో సీనియర్ నేత కరణం బలరాంను తెలుగుదేశం పార్టీ అధిష్టానం చీరాలకు తీసుకు వచ్చింది.

అందరూ వైసీపీలోకి వెళ్లడంతో….

2019 ఎన్నికల్లో కరణం బలరాం గెలిచారు. ఆమంచి వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. చివరకు కరణం బలరాం టీడీపీని వీడి అనధికారికంగా వైసీపీలో చేరిపోయారు. చీరాల నియోజకవర్గంలో టీడీపీ బలమైన నేతలు మాజీ మంత్రి పాలేటి రామారావు, కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్, పోతుల సునీత, చిమటా సాంబు, సజ్జా చంద్రమౌళి వంటి నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. దీంతో చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిర్వీర్యమయిపోయిందంటున్నారు.

కరణం కనుసన్నల్లోనే….

దీంతో టీడీపీ వైసీపీ చీరాల ఇన్ ఛార్జిగా గతంలో వ్యవహరించిన యెడం బాలాజీకి టీడీపీ పగ్గాలు అప్పగించారు. యడం బాలాజీ కరణం బలరాం ముఖ్య అనుచరుడు. కరణం బలరాం సూచనల మేరకే యడం బాలాజీ పార్టీ పగ్గాలు అందుకున్నట్లు సమాచారం. దీంతో చీరాల తెలుగుదేశం పార్టీలో యాక్టివిటీ పూర్తిగా స్థంభించిపోయింది. చంద్రబాబు సయితం చీరాల విషయంలో సీరియస్ గా దృష్టి పెట్టలేదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కరణం బలరాం తిరిగి టీడీపీలోకి వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. అందుకే ఆయన యడం బాలాజీని పెట్టి నడిపిస్తున్నారన్న టాక్ బలంగా విన్పిస్తుంది.

Tags:    

Similar News