గ్రీన్ సిగ్నల్

ఎట్టకేలకు కర్ణాటక మంత్రి వర్గ విస్తరణకు పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అమిత్ షాతో భేటీ తర్వాత విస్తరణ చేపట్టేందుకు యడ్యూరప్ప సిద్ధమయ్యారు. యడ్యూరప్ప [more]

Update: 2020-02-01 16:30 GMT

ఎట్టకేలకు కర్ణాటక మంత్రి వర్గ విస్తరణకు పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అమిత్ షాతో భేటీ తర్వాత విస్తరణ చేపట్టేందుకు యడ్యూరప్ప సిద్ధమయ్యారు. యడ్యూరప్ప చెప్పినట్లే అంతా నడుస్తోంది. తాను అనుకున్న విధంగానే మంత్రివర్గాన్ని విస్తరించాలన్నదిద యడ్యూరప్ప అభిప్రాయంగా ఉంది. రెండు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి వర్గ విస్తరణ జాబితాపై అధిష్టానం ఆమోదముద్ర పడింది.

13 లేదా 14 మందితో…..

బీజేపీ ప్రభుత్వం తిరిగి కర్ణాటకలో ఏర్పడటానికి కారణమైన పదిమందికి మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కల్పించనున్నారు. వీరితో పాటు మరో ముగ్గురు లేదా నలుగురికి సీనియర్ నేతలకు మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి మంత్రి వర్గ విస్తరణ పదమూడు లేదా పధ్నాలుగుకు మించదని తెలుస్తోంది. మంత్రి పదవులు దక్కకుండా అసంతృప్తికి గురయ్యే అవకాశమున్న వారికి ఇతర పదవులను కేటాయించాలని అధిష్టానం యడ్యూరప్ప కు చెప్పినట్లు తెలిసింది.

ఆధిపత్యం కోసం….

ఈ మంత్రి వర్గ విస్తరణ ద్వారా యడ్యూరప్ప తన ఆధిపత్యాన్ని చాటుకోనున్నారు. ఇప్పటి వరకూ అధిష్టానం తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని తెలుసుకున్న సీనియర్ నేతలు కొందరు యడ్యూరప్పపై కూడా విమర్శలు చేయడం ప్రారంభించారు. పార్టీలో కొత్త వారికి ఎలా పదవులు ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం సయితం యడ్యూరప్పకు వ్యతిరేకంగా ఆయన వ్యతిరేకులను దగ్గర తీయడం పలు సందర్భాల్లో కన్పించింది.

అప్పదే అప్పర్ హ్యాండ్…..

ఈ నేపథ్యంలో యడ్యూరప్ప తాను అనుకున్నది సాధించారు. ఎవరైతే తాను ముఖ్యమంత్రి కావడానికి సహకరించారో వారికి పదవులు ఇచ్చేందుకు అప్ప రెడీ అయిపోయారు. ఈ విషయాన్ని అధిష్టానం వద్ద కుండబద్దలు కొట్టడంతో అమిత్ షా సయితం జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద అప్ప తన వ్యతిరేకులపై అప్పర్ హ్యాండ్ సాధించారంటున్నారు. బహుశ సోమవారం మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశముంది.

Tags:    

Similar News