“చేయి” దాటి పోయిందా….??
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు. అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్నా వారు ససేమిరా అంటున్నారు. తొలి నుంచి [more]
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు. అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్నా వారు ససేమిరా అంటున్నారు. తొలి నుంచి [more]
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు. అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్నా వారు ససేమిరా అంటున్నారు. తొలి నుంచి భయపడుతున్నట్లే మంత్రి వర్గ విస్తరణ జరిగితే ముప్పు తప్పదన్న హెచ్చరికలు నిజమయ్యేలా కన్పిస్తున్నాయి. కర్ణాటక సంకీర్ణ సర్కారు దానంతట అదే పడిపోయే అవకాశాలు స్పష్టం కన్పిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి వేణుగోపాల్ లు చేసిన ప్రయత్నాలు సఫలికృతం కాలేదు. అయినా తమ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీలేదని పైకి సిద్ధరామయ్య గాంభీర్యత ప్రదర్శిస్తున్నారు.
అసంతృప్త నేతలు…
మరోవైపు అసంతృప్త నేతలు కన్పించకుండా పోవడం కూడా కాంగ్రెస్ పార్టీని ఆందోళనలో పడేసింది. తమ ప్రాంతంలో మంత్రి డీకే శివకుమార్ జ్యోక్యాన్ని సహించలేనంటూ తొలినుంచి అసమ్మతి స్వరాన్ని విన్పిస్తూ ఇటీవల మంత్రి పదవిని కోల్పోయిన రమేష్ జార్ఖిహోళి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు దాదాపు సిద్ధమయ్యారు. ఆయన గత మూడు రోజులుగా ఎవరితో టచ్ లో లేరు. ఆయన బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు బలంగా విన్పిస్తున్నాయి.
ఢిల్లీకి వెళ్లి…..
రమేష్ జార్ఖిహోళితో పాటు మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు కాంగ్రెస్ పెద్దలు గుర్తించారు. వీరిలో కొందరిని బుజ్జగించినా పైకి సరేనని అంటున్నారని, అవకాశం వస్తే జంప్ చేస్తారన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం. రమేష్ జార్ఖిహోళితో పాటు మరికొందరు నేరుగా అమిత్ షాతో భేటీ అయి తమ రాజీకీయ భవిష్యత్ పై భరోసా పొందిన తర్వాత వారు పార్టీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
సర్కార్ కుప్పకూలితే…..
మరోవైపు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాత్రం తమ ప్రమేయం లేకుండేనే సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలుతుందని, అవకాశం వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించడం కూడా కలకలం రేపుతుంది. మరోవైపు కుమారస్వామి మాత్రం అంతా కాంగ్రెస్ పైనే భారం వేశారు. రమేష్ జార్ఖిహోళి వెంట వెళ్లే ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై ఇంటలిజెన్స్ నివేదికను కాంగ్రెస్ నేతలకు కుమారస్వామి ఇచ్చారని తెలుస్తోంది. మొత్తం మీద కర్ణాటకలో రాజకీయం హాట్ హాట్ గా ఉందని చెప్పొచ్చు.