ఎన్నాళ్లిలా…?

కర్ణాటకలో కుమారస్వామి బలపరీక్ష ఈరోజు కూడా జరిగే అవకాశంలేదు. ఈరోజు సాయంత్రం 6గంటల్లోగా బలపరీక్షను నిర్వహిస్తానని స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించడంతో భారతీయ జనతా పార్టీ సభ్యులు [more]

Update: 2019-07-22 16:30 GMT

కర్ణాటకలో కుమారస్వామి బలపరీక్ష ఈరోజు కూడా జరిగే అవకాశంలేదు. ఈరోజు సాయంత్రం 6గంటల్లోగా బలపరీక్షను నిర్వహిస్తానని స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించడంతో భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా ఉత్సాహంగా ఉదయం నుంచి సభలో కన్పించారు. అయితే స్పీకర్ ప్రకటనకు విరుద్ధంగా సభా కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశ్వాసపరీక్షపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈరోజు చర్చ ముగిసే అవకాశం లేదు. ఒక్కొక్క సభ్యుడు మూడు, నాలుగు గంటలు ప్రసంగిస్తుండటంతో మరో రోజు విశ్వాస పరీక్షపై చర్చ జరిగే అవకాశముంది.

కుమారస్వామి కోరినా…..

ఇప్పటికే ముఖ్యమంత్రి కుమారస్వామి స్పీకర్ రమేష్ కుమార్ ను కలసి తమకు బుధవారం బలపరీక్ష చేసుకునేందుకు అనుమతించాలని కోరారు. అయితే అందుకు స్పీకర్ అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే తననై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని, ఈరోజే బలపరీక్ష నిర్వహిస్తానని తెలపడంతో అందరూ ఈరోజు విశ్వాస పరీక్ష ఉంటుందని భావించారు. భారతీయ జనతా పార్టీ తన సభ్యులెవరూ సభకు గైర్హాజరుకాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది.

ససేమిరా అంటున్న సిద్ధరామయ్య…..

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా బలపరీక్షపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల అంశంలో స్పష్టత రాకుండా బలపరీక్షపై ఓటింగ్ ఎలా నిర్వహిస్తారని సిద్దరామయ్య ప్రశ్నిస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా విశ్వాస పరీక్షపై ఓటింగ్ నిర్వహించడానికి వీలులేదంటూ సిద్ధరామయ్య పట్టుబడుతున్నారు. రేపు సుప్రీంకోర్టులో విప్ విషయంలోనూ స్పష్టత వచ్చే అవకాశముందని, విశ్వాస పరీక్షపై ఓటింగ్ ను వాయిదా వేయాలని సిద్దరామయ్య కోరుతున్నారు.

మానసికంగా సిద్దమై…..

ముఖ్యమంత్రి కుమారస్వామి మానసికంగా సిద్ధమయినట్లే కన్పిస్తున్నారు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి వస్తే తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని తెలిపారు. కాంగ్రెస్ నేతలు కూడా కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రి అవుతారని, వచ్చి తిరిగి పార్టీలో చేరండని పిలుపునిచ్చినా రెబల్ ఎమ్మెల్యేల నుంచి స్పందన లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు మెత్తబడే వరకూ విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని భావిస్తోంది.

Tags:    

Similar News