రెడ్డిగారివి మాటలేనా? యువ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు…?
వారసత్వ రాజకీయాలు ఈ దేశంలో మామూలే. అయితే, వారసులుగా రాజకీయాల్లోకి వచ్చినా.. తమకంటూ.. ప్రత్యేకతను నిలుపుకొంటేనే నాయకులుగా మిగులుతారనేది వాస్తవం. ఇలా వారసులుగా వచ్చినప్పటికీ.. తమకంటూ ప్రత్యేకతను [more]
వారసత్వ రాజకీయాలు ఈ దేశంలో మామూలే. అయితే, వారసులుగా రాజకీయాల్లోకి వచ్చినా.. తమకంటూ.. ప్రత్యేకతను నిలుపుకొంటేనే నాయకులుగా మిగులుతారనేది వాస్తవం. ఇలా వారసులుగా వచ్చినప్పటికీ.. తమకంటూ ప్రత్యేకతను [more]
వారసత్వ రాజకీయాలు ఈ దేశంలో మామూలే. అయితే, వారసులుగా రాజకీయాల్లోకి వచ్చినా.. తమకంటూ.. ప్రత్యేకతను నిలుపుకొంటేనే నాయకులుగా మిగులుతారనేది వాస్తవం. ఇలా వారసులుగా వచ్చినప్పటికీ.. తమకంటూ ప్రత్యేకతను సంతరించుకుని, ఒక హిస్టరీ క్రియేట్ చేసిన వారు చాలా మంది ఉన్నారు. అయితే, గుంటూరు జిల్లాలో గత ఏడాది విజయం సాధించిన యువ నాయకుడు, కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబానికి చెందిన కాసు మహేష్ రెడ్డి చేతల కన్నా.. మాటలకే ఎక్కువగా పరిమితమవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పల్నాడు ప్రాంతంలోని గురజాల నియోజకవర్గం నుంచి కాసు విజయం సాధించింది ఏడాది పూర్తయింది.
పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నా….
ఈ ఏడాది కాలంలో కాసు మహేష్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపట్టారు. నియోజకవర్గంలో పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. అయితే, తనకంటూ ఓ విజన్ ఏర్పాటు చేసుకోకుండా.. కేవలం జగన్ కనుసన్నల్లో కార్యక్రమాలు చేస్తున్నారనేది స్థానికంగా వినిపిస్తున్న వాదన. ఇది కూడా మంచిదే కదా? అంటే.. నిజమే .. కానీ, స్థానికంగా ఎదురయ్యే సమస్యలు, ఉన్న సవాళ్లు వంటివి.. నేరుగా జగన్‌కు తెలిసే అవకాశం లేదు. అవన్నీ ఎమ్మెల్యేగా క్షేత్రస్థాయిలో ఉన్న నాయకుడికి బాగా తెలుస్తాయి. అదే సమయంలో ప్రజల నుంచి అనేక సమస్యలు కూడా నేరుగా సీఎంకు కాకుండా.. ఎమ్మెల్యేకే వస్తాయి.
మాటలే తప్పించి….
ఇలాంటి వాటిపై వెంటనే స్పందించి. వాటిని పరిష్కరించే చొరవ ఎమ్మెల్యేకి ఉంటుందని అందరూ భావిస్తారు. దీనికి తగ్గట్టే కాసు మహేష్ రెడ్డి నియోజకవర్గంలో చేతల మనిషిగా కంటే మాటల మనిషిగానే ఎక్కువ మార్కులు వేయించుకుంటున్నారన్న టాక్ వచ్చేసింది. .ఇంకేముంది.. నా తడాఖా చూపిస్తాను.. ఆకాశాన్ని దింపేస్తాను.. అంటూ హామీలైతే ఇస్తున్నారు తప్ప.. వాటిని పరిష్కరించే విషయంలో మాత్రం ఆయన చొరవ చూపించలేక పోతున్నారని, సీఎం జగన్ వద్ద మాట్లాడడం లేదని, కేవలం జగన్ చెప్పింది విని.. ఆచరణలో పెట్టడమేనని అంటున్నారు.
పనులు చేయడంలో మాత్రం….
గతంలో నరసరావు పేట నుంచి గెలిచిన కాసు వెంకట కృష్ణారెడ్డి కూడా ఇలానే ప్రకటనలు చేశారు.. తప్ప పనులు చేయడంలో మాత్రం దూకుడు ప్రదర్శిం చేవారు కాదని, ఇప్పుడు అదే వారసత్వం మహేష్‌కు అబ్బినట్టుగా ఉందని అంటున్నారు గురజాల ప్రజలు. వాస్తవంగా చూస్తే జిల్లాలో వెనకపడిన ప్రాంతమైన పల్నాడులో ముఖద్వారంగా ఉన్న గురాజల నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇది పూర్తిగా వెనకపడిన ప్రాంతం. నియోజకవర్గంలో చాలా గ్రామాలకు సరైన రహదారులు లేవు. మంచినీటి సమస్య కూడా తీవ్రంగానే ఉంది.
గాలివాటంలో గెలిచి….
పట్టణం అయిన పిడుగురాళ్లతో పాటు కొత్తగా నగర పంచాయతీలుగా ఏర్పడిన దాచేపల్లి, నియోజకవర్గ కేంద్రమైన గురజాలలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ యేడాదిలో వాటిల్లో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. మరి కాసు ఇప్పటకి అయిన అభివృద్ధిలో తన మార్క్ చూపిస్తారా ? లేదా జగన్ గాలిలో గాలివాటంలా గెలిచిన ఎమ్మెల్యేగా మిగిలి పోతారా ? అన్నది చూడాలి.