కాసు దూకుడుకు బ్రేకులు వేసిందెవ‌రు? గుంటూరులో ఏం జ‌రిగింది?

కాసు మ‌హేష్‌రెడ్డి. గుంటూరు జిల్లా ప‌ల్నాడులోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం గుర‌జాల నుంచి అనూహ్య రీతిలో విజ‌యం సాధించిన యువ నాయ‌కుడు. సీనియ‌ర్ రాజకీయ కుటుంబం నుంచి పాలిటిక్స్‌లోకి [more]

Update: 2020-06-21 03:30 GMT

కాసు మ‌హేష్‌రెడ్డి. గుంటూరు జిల్లా ప‌ల్నాడులోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం గుర‌జాల నుంచి అనూహ్య రీతిలో విజ‌యం సాధించిన యువ నాయ‌కుడు. సీనియ‌ర్ రాజకీయ కుటుంబం నుంచి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కాసు మ‌హేష్‌రెడ్డి. అనేక హామీల‌ను కుమ్మరించి.. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. ఎన్నిక‌ల‌కు ముందు ఇక్కడ పాద‌యాత్ర కూడా చేప‌ట్టారు. ఉన్నత చ‌దువు ఉన్న నాయ‌కుడు, జ‌గ‌న్‌కు వీరాభిమాని కావ‌డం కూడా కాసు మ‌హేష్‌రెడ్డికి క‌లిసి వ‌చ్చింది. దీంతో జ‌గ‌న్ కాసుకు గుర‌జాల టికెట్ ఇచ్చారు. వాస్తవానికి దీనిని జంగా కృష్ణమూర్తికి ఇవ్వాల్సి ఉంది.

ఆయనను తప్పించి మరీ…?

అయితే, ఆయ‌న‌ను త‌ప్పించి మ‌రీ జ‌గ‌న్ కాసు మ‌హేష్‌రెడ్డికి ఇచ్చారు. జ‌గ‌న్ సునామీ స‌హా.. కాసు వ్యూహం.. విప‌క్ష నేత, అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది చేసినా… ఓవ‌రాల్‌గా జ‌గ‌న్ ప్రభంజ‌నం.. టీడీపీపై ఉన్న వ్యతిరేక‌త ఫ‌లించి.. కాసు మ‌హేష్‌రెడ్డి విజ‌యం సాధించారు. పైగా గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపుగా 30 వేల రెడ్డి సామాజిక వ‌ర్గ ఓట‌ర్లు ఉన్నారు. ఈ సామాజిక వ‌ర్గానికి రెండున్నర ద‌శాబ్దాల త‌ర్వాత ఓ ప్రధాన పార్టీ సీటు ఇవ్వడంతో వారంద‌రూ క‌లిసి క‌ట్టుగా కృషి చేసి కాసు మ‌హేష్‌రెడ్డి నాన్ లోక‌ల్ అయినా గెలిపించారు.

సొంత పార్టీ నేతల నుంచే….

ఇక ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల మేర‌కు… అనుకున్న విధంగానే ఆయ‌న అభివృద్ధి ప‌నుల‌కు రంగం సిద్ధం చేసుకున్నారు. ప‌నులు పుర‌మాయించే లోపు క‌రోనా లాక్‌డౌన్ వ‌చ్చింది. అయితే, ఇప్పుడు కాసు మ‌హేష్‌రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు వ‌స్తున్నాయి. ఆయ‌న భారీ అవినీతి చేశార‌ని, అభివృద్ధి ప‌నుల పేరుతో నిధులు తినేశార‌ని సొంత పార్టీ నేత‌లే ఆయ‌న‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ విష‌యం నేరుగా జ‌గ‌న్ వ‌ర‌కు వెళ్లింది. దీంతో ప్రస్తుతం కాసు మ‌హేష్‌రెడ్డి చేప‌ట్ట ద‌ల‌చిన ప‌నుల‌ను తాను చెప్పే వ‌ర‌కు ఆపాల‌ని సీఎం నుంచి ఆదేశాలు వ‌చ్చాయ‌ని.. తాజాగా నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ ప్రారంభ‌మైంది. దీనికి త‌గిన విధంగా ప‌నులు చేప‌ట్టేందుకు ముందుకు వ‌చ్చిన కాంట్రాక్టర్లు కూడా త‌ప్పుకొన్నారు.

ఎవరినీ లెక్క చేయకపోవడంతో…

ఇదిలా వుంటే.. ప్రస్తుత ప‌రిస్థితితో కాసు మ‌హేష్‌రెడ్డి షాక్‌కు గుర‌య్యారు. అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యంపై ఆయ‌న ఆరా తీస్తున్నారు. పార్టీలో సీనియ‌ర్లను ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, త‌న‌కు న‌చ్చిన విధంగా ప‌నులు చేసుకుని పోతున్నారే త‌ప్ప.. పెద్దల‌కు అస‌లు విలువ కూడా ఇవ్వడం లేద‌ని, ఈ నేప‌థ్యంలోనే కాసు మ‌హేష్‌రెడ్డిపై ఇలాంటి ఆరోప‌ణ‌లు వ‌చ్చి ఉంటాయ‌ని అంటున్నారు. ఇది కూడా నిజ‌మే అనిపిస్తోంది. త‌న‌కు టికెట్ రావ‌డం కోసం త‌న సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే జంగాను కాసు మ‌హేష్‌రెడ్డి లెక్కచేయ‌డం లేదు. స్థానిక ఎన్నిక‌ల్లోనూ త‌న వారికి ఓ నాలుగు సీట్లు ఇవ్వాల‌ని కోరినా.. అన్నీతానై వ్యవ‌హ‌రించిన కాసు.. జంగా అభ్యర్థన‌ను ప‌ట్టించుకోలేదు. అదే స‌మ‌యంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి చెప్పినా కూడా ఆయ‌న లెక్కచేయ‌లేద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో నే కాసు మ‌హేష్‌రెడ్డి దూకుడు బ్రేకులు వేసేలా నాయ‌కులు చ‌క్రం తిప్పార‌ని అంటున్నారు. రేపో మాపో.. కాసును సీఎంవోకు పిలుస్తార‌ని గుర‌జాల‌లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News