కేసీఆర్ స్కెచ్… అప్పుడే మొదలయిందా?
వచ్చే ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. అన్ని రకాలుగా ప్రత్యర్థి పార్టీలను కట్టడి చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తనతో [more]
వచ్చే ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. అన్ని రకాలుగా ప్రత్యర్థి పార్టీలను కట్టడి చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తనతో [more]
వచ్చే ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. అన్ని రకాలుగా ప్రత్యర్థి పార్టీలను కట్టడి చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తనతో కలసి వచ్చే వారిని వచ్చే ఎన్నికల్లో కలుపుకుని పోయేందుకు కేసీఆర్ సిద్దమవు తున్నారు. ముఖ్యంగా ఖమ్మంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పట్టున్న వామపక్ష పార్టీలను ఈసారి కలుపుకుని వెళ్లాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది.
హ్యాట్రిక్ కొట్టాలని….
వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ విక్టరీని కొట్టాలన్నది కేసీఆర్ ప్రయత్నం. దాదాపు తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉండటంతో సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ తో ఈసారి ఏ పార్టీ జత కట్టే అవకాశాలు లేవు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడి కాంగ్రెస్ దెబ్బతినింది. అప్పుడు కాంగ్రెస్ తో జత కట్టిన సీపీఐ, కోదండరామ్ కు చెందిన తెలంగాణ జనసమితి, టీడీపీ లు వచ్చే ఎన్నికల నాటికి దూరంగా ఉంటాయని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.
వామపక్షాలను….
ఇక కోదండరామ్ కు చెందిన తెలంగాణ జన సమితి కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. బీజేపీ ఎటూ తనతో కలసి వచ్చే వారితో కలసి పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో వామపక్షాలను తన దరికి చేర్చుకుంటే దాదాపు పది నుంచి ఇరవై నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు లబ్ది చేకూరుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. వామపక్షాలు సహజంగానే కేసీఆర్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి.
వారు కూడా అదే ఆలోచనలో…?
ఇటీవల జరిగిన సాగర్ ఎన్నికలలోనూ స్థానిక లెఫ్ట్ పార్టీల నాయకత్వం టీఆర్ఎస్ కే మద్దతు పలికింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేశాయి. కానీ వచ్చే ఎన్నికల్లో తక్కువ స్థానాలను కేటాయించైనా వామపక్షాలను తన దరికి చేర్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లభించకపోవడంతో అధికార పార్టీతో కలసి నడవటమే బెటరన్న ఆలోచనలో వామపక్షాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద కేసీఆర్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలసి బరిలోకి దిగుతారన్న ప్రచారం జరుగుతోంది.