మారిన కేసీఆర్ … ఈటెల ఎఫెక్ట్ గట్టిగా పడిందా …?

కేసీఆర్ కు కుడిభుజంగా ఉన్న ఈటెల రాజేందర్ ను వ్యూహాత్మకంగా బయటకు పంపించారు గులాబీ బాస్. అప్పటినుంచి గతంలో ఎన్నడు లేనివిధంగా గులాబీ శిబిరంలో కలవరం మొదలైందనే [more]

Update: 2021-07-03 09:30 GMT

కేసీఆర్ కు కుడిభుజంగా ఉన్న ఈటెల రాజేందర్ ను వ్యూహాత్మకంగా బయటకు పంపించారు గులాబీ బాస్. అప్పటినుంచి గతంలో ఎన్నడు లేనివిధంగా గులాబీ శిబిరంలో కలవరం మొదలైందనే చెప్పాలి. కరోనా సెకండ్ వేవ్ ను సైతం పక్కన పెట్టి కారు పార్టీ లోని అధినేత నుంచి కింది స్థాయి నేతవరకు క్షేత్ర స్థాయిలోకి దిగిపోయారు. ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కిపోయాయి తెలంగాణ గడ్డపై. ఒక పక్క ఈటెల ప్రభావంతో అసంతృప్తులు పార్టీ నుంచి జారిపోకుండా కట్టడికి పటిష్ట వ్యూహం. మరోపక్క హుజురాబాద్ లో ఉప ఎన్నిక గెలిచేందుకు వెనుక ముందు కార్యాచరణ పెద్దఎత్తునే మొదలైపోయింది.

పాతకాపులకు మంచి రోజులు …

మాజీ స్పీకర్ మధుసూధనాచారి, కడియం శ్రీహరి మొదలు హరీష్ రావు వరకు గతంలో ఫైర్ గన్స్ గా ఉద్యమ సమయంలో వెలుగు వెలిగిన గులాబీ దళంలో ఉన్న వారందరిని ఒక్కసారిగా అక్కున చేర్చుకున్నారు కేసీఆర్. వారినే అస్త్రాలుగా మలచి తన ప్రత్యర్థి శిబిరంపై ఎక్కుపెట్టారు. ఫామ్ హౌస్ సిఎం అనే పేరును తుడిచేసుకుంటూ జిల్లా టూర్స్ మొదలు పెట్టేశారు. సర్పంచ్ ల స్థాయి నాయకులతో నేరుగా ఫోన్ లో మాట్లాడటం వీలైతే భోజనాలు కూడా చేయడం వారి ఇంటికి ముఖ్యమంత్రి వెళ్ళి క్యాడర్ కు తానిచ్చే ప్రాధాన్యత ఇది అని చెప్పక చెప్పడం. టోటల్ గా మాస్ క్లాస్ లీడర్ తానే అనే అవతారం దాల్చడం. ఇలా ఒకటేమిటి ఇప్పుడు కేసీఆర్ విశ్వరూపం రోజుకో అవతారం అంతా దర్శించుకుంటున్నారు.

ఈటెల కారుకు బ్రేక్ లు వేస్తారా లేదా …?

ఇక దూకుడు గా ఉండే కేసీఆర్ తనయుడు కెటిఆర్ మరింత స్పీడ్ గా రాజకీయాలు మరోపక్క సాగిస్తూ అభివృద్ధి మంత్రం పఠిస్తూ నడుస్తున్నారు. ఈవిధమైన రాజకీయాలు తెలంగాణ ఉద్యమ సమయంలో తప్ప ఇప్పటివరకు తెలంగాణ లో ఎవరు చూసి ఉండలేదన్నది ప్రస్తుతం టాక్. వీటన్నిటికీ ఒకే ఒక్కడు ఈటెల రాజేందర్ అన్నది సామాన్యుడికి సైతం అర్ధం కావడం గమనార్హం.అయితే కేసీఆర్ అండ్ టీం పడుతున్న కష్టం హుజురాబాద్ లో ఈటలను ఓడిస్తేనే ఫలిస్తుంది. మరి గులాబీ దళపతి కోరికను ఎలా అడ్డుకుంటారో ఆయన స్కూల్ నుంచే వచ్చిన ఈటల ఎలా బ్రేక్ చేస్తారన్నది సర్వత్రా ఆసక్తికరం.

Tags:    

Similar News