ఈటలను ఓడించాలంటే?
హుజూరాబాద్ లో ఎన్నికల వాతావరణం ఇప్పటి నుంచే ప్రారంభమయింది. అధికార టీఆర్ఎస్ ఈసారి హుజుారాబాద్ ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతుంది. ఈటల [more]
హుజూరాబాద్ లో ఎన్నికల వాతావరణం ఇప్పటి నుంచే ప్రారంభమయింది. అధికార టీఆర్ఎస్ ఈసారి హుజుారాబాద్ ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతుంది. ఈటల [more]
హుజూరాబాద్ లో ఎన్నికల వాతావరణం ఇప్పటి నుంచే ప్రారంభమయింది. అధికార టీఆర్ఎస్ ఈసారి హుజుారాబాద్ ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతుంది. ఈటల రాజేందర్ సయితం ఇక్కడ మరోసారి గెలిచి తన సత్తా చాటాలని భావిస్తున్నారు. దీంతో హుజూరాబాద్ లో ఎన్నికల వాతావరణం కన్పిస్తుంది. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యం.
అనేక పేర్లు పరిశీలనలో….
బీజేపీ నుంచి ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ అభ్యర్థి అని తేలిపోయింది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఎవరనేది ఇంకా ఒక స్పష్టత రాలేదు. సామాజికవర్గాల వారీగా అనేక మంది అభ్యర్థుల పేర్లు కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వినోద్ కుమార్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు సతీమణితో పాటు కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి, ముద్దసాని పురుషోత్తం రెడ్డి వంటి పేర్లు ఇప్పుడు అధికార పార్టీలో విన్పిస్తున్నాయి.
చివరి క్షణం వరకూ….
అయితే ఈటల రాజేందర్ ను ఓడించి టీఆర్ఎస్ నాయకత్వాన్ని మరింత బలపర్చుకోవాలన్నది కేసీఆర్ ఆలోచన. ఈ మేరకు అభ్యర్థి నిర్ణయంపై కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తారంటున్నారు. అనేక సర్వేలు చేయించిన తర్వాతనే చివరి నిమిషంలో హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయి. ఈటల రాజేందర్ కు ధీటైన అభ్యర్థి కోసం చివరి నిమిషం వరకూ వెదుకులాట జరుగుతునే ఉంటుందంటున్నారు.
నిధుల కేటాయింపు….
ఈలోపే హుజూరాబాద్ పై పట్టు సాధించేందుకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రులను అనధికారికంగా ఇన్ ఛార్జులుగా నియమించారు. మండలాల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించనున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ అభివృద్ధి కోసం 35 కోట్ల ను కేటాయించారు. ఈ పనులను 45 రోజుల్లోగా పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. మొత్తం మీద ఈటలను ఓడించడమే ధ్యేయంగా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది.