సాగర్ లో కేసీఆర్ లెక్కలు తప్పవట…?
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత లెక్కలు కరెక్ట్ గా వర్క్ అవుట్ అయితే విజయం వరించక తప్పదంటున్నారు. దుబ్బాక తరహాలో నాగార్జున సాగర్ ను [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత లెక్కలు కరెక్ట్ గా వర్క్ అవుట్ అయితే విజయం వరించక తప్పదంటున్నారు. దుబ్బాక తరహాలో నాగార్జున సాగర్ ను [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత లెక్కలు కరెక్ట్ గా వర్క్ అవుట్ అయితే విజయం వరించక తప్పదంటున్నారు. దుబ్బాక తరహాలో నాగార్జున సాగర్ ను కేసీఆర్ వదిలేయలేదు. సాగర్ లో మండలాల వారీగా మంత్రులను కేసీఆర్ రంగంలోకి దించారు. ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. వారికి విధించిన టార్టెట్ తోనే మెజారిటీ దాదాపు ఇరవై వేలు దాటాలన్నది కేసీఆర్ విధించిన లక్ష్యంగా తెలుస్తోంది.
దుబ్బాక లాగా వదిలేయకుండా….
దుబ్బాక ఉప ఎన్నికలను కేసీఆర్ ఈజీగా తీసుకున్నారు. తాను కూడా ప్రచారానికి వెళ్లకుండా అంతా హరీశ్ రావుపైనే వదిలేశారు. మంత్రులను కూడా ఎవరినీ అక్కడ నియమించకుండా అతి విశ్వాసాన్ని చూపారు. దీంతో దుబ్బాక దెబ్బకొట్టింది. అయితే అదే సమయంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కేసీఆర్ గెలుచుకున్నారు. అక్కడ అభ్యర్థుల ఎంపిక, సర్వేల్లో వెల్లడయిన లోటుపాట్లను భర్తీ చేయడంతో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.
చివరి నిమిషం వరకూ….
ఇప్పుడు నాగార్జున సాగర్ లోనూ అదే తరహా వ్యూహాన్ని రచించారు. నాగార్జున సాగర్ అభ్యర్థి ఎంపికను చివరి నిమిషం వరకూ కేసీఆర్ నాన్చారు. నోముల భగత్ పేరు బయటకు పదే పదే విన్పిస్తున్నా ఆయన పేరును ప్రకటించలేదు. సర్వేల మీద సర్వేలు చేయించారు. అనేక మంది పేర్లను పరిశీలించారు. దీంతో సామాజికవర్గాల సమీకరణతో పాటు, సానుభూతి కూడా ఇక్కడ పనిచేస్తుందని భావించి నోముల భగత్ పేరును చివరి నిమిషంలో ప్రకటించారు.
ఏ ఒక్కరికో అప్పగించకుండా….
ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బాధ్యతను దుబ్బాక తరహాలో ఏ ఒక్కరికీ అప్పగించలేదు. మంత్రులందరికీ బాధ్యతలను అప్పగించారు. సామాజికవర్గాల వారీగా మంత్రులను, నేతలను ఆ ప్రాంతాలకు ప్రచారానికి పంపుతున్నారు. యాదవ సామాజికవర్గం ఓట్లు ఇక్కడ అత్యధికంగా ఉండటంతో గంపగుత్తగా పడేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సాగర్ కు ముందే కేసీఆర్ వరాలజల్లు ప్రకటించారు. ఇలాంటి లెక్కలతో వెళుతున్న కేసీఆర్ కు సాగర్ తన చేయి దాటదన్న నమ్మకంతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.